చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు.దీంతో పార్టీలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఎగసి పడింది.అసమ్మతి నాయకుల దృష్టి త్వరలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలపై పడింది.
ప్రత్య ర్థులను పార్టీలోకి ఆహ్వానించినా …ఓర్చు కున్నామని కనీసం ఎమ్మెల్సీ పదవితో అయినా ఊరటనివ్వాలని వారు ఆశిస్తున్నారు కడప జిల్లాకు జెందిన ఇద్దరు టీడీపీ సీనియర్ నాయకలు.
వాల్లిద్దరు ఎవరో కాదు ఒకరు సతీష్‌రెడ్డి మరోకరు రామసుబ్బారెడ్డి.వీళ్లిద్దరి ఆశలూ గవర్నర్ కోటాలో భర్తీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల మీదే ఉన్నాయి. బాబు ఛాన్సిస్తాడనే ఆశలతోనే ఉన్నారిద్దరూ. మొన్నటి వరకూ సతీష్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండటంతోపాటు మండలి డిప్యూటి ఛైర్మెన్‌గా కొనసాగారు.ఇప్పుడు అవేవిలేవు.మరోసారి తన టర్మ్‌ను బాబు ఎక్స్‌టెండ్ చేస్తాడని సతీష్ రెడ్డి బాబుకు విన్నవించినా లాభం లేదు.
{loadmodule mod_custom,GA1}
ఇక రామసుబ్బారెడ్డి కథ అంతే.పార్టీలో ఎన్ని అవమానాలను ఎదుర్కొంటున్నాను, నా మీద జాలి చూపరా.. అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. తెలుగుదేశంపార్టీ తరపున మొన్నటి ఎన్నికల్లో నానా కష్టాలను ఎదుర్కొని పోటీ చేసిన తనను కాదని తన ప్రత్యర్థిని తెచ్చి ఏకంగా మంత్రిని చేయడంతో రామసుబ్బారెడ్డి దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.ఎమ్మెల్సీపై అనే కొండంత ఆశలతో ఉన్నాడు రామసుబ్బారెడ్డి. మరి బాబు అవకాశం ఇస్తాడా? అనేదే సందేహంగా కనిపిస్తోంది.
ఎలాగూ ఎమ్మెల్యే సీట్లు పెరిగేలా లేవు.. ఇప్పుడు గనుక రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే.. టీడీపీలోనే ఉంటాడు.రామసుబ్బారెడ్డికి అవకాశం ఇవ్వకపోతే వైకాపా వైపు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆ రకంగా ఒక తలనొప్పి తగ్గిపోతుందని చంద్రబాబు లెక్కేస్తే రామ సుబ్బారెడ్డి పరిస్థితి అగమ్యగోచరంలో పడినట్లే.మరి బాబు ఇద్దరిలో ఎవరి మీద కరుణ చూపిస్తారో చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Related