Friday, May 3, 2024
- Advertisement -

కొత్త అవతారం ఎత్తిన ఏపీ డిప్యూటీ సీఎం పుస్పశ్రీవాణి…

- Advertisement -

సినిమా వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అలాగే రాజకీయ నాయకులు చాలామంది సినిమా లో కూడా కనిపిస్తుంటాడు. ఇదంతా మామూలే.దివంగత మాజీ ఎంపీ శివప్రసాద్ విభిన్నమైన పాత్రలను చేస్తూ అటు రాజకీయాలు ఇటు సినిమాలో రాణిస్తుండేవారు. అయితే ఇటు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు ఈ రెండింటిలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంకూడా సినిమాల్లో నటిస్తున్నారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా…. అవును మీరు విన్నది నిజమే.

ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం తెలిపేలా తెరకెక్కిస్తున్న ‘అమృత భూమి’ అనే సినిమాలో పుష్ప శ్రీవాణి నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవాణి టీచర్ గా కనిపించనున్నారు.ఈ సందర్భంగా విజయనగరం లోని గుమ్మలక్ష్మీపురం మండలంలోని లోవ ముఠా ప్రాంతం గొరడా గ్రామంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. కాగా షూటింగ్ లో భాగంగా టీచర్ పాత్రలో నటిస్తున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పై కొన్ని సీన్లు షూట్ చేశారు.

ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా సినిమా నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్యపర్చేందుకు ఈ చిత్రాన్ని రూపొం దిస్తున్నట్టు నటుడు రాజప్రసాద్ బాబు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -