Monday, April 29, 2024
- Advertisement -

జగన్ మౌనం మంచిది కాదంటున్న రాజకీయ వర్గాలు….

- Advertisement -

ప్రభుత్వంపై ప్రతిపక్షాలనుంచి ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటి వరకు ఒక్క సారి కూడా వస్తున్న విమర్శలపై స్పందించలేదు.పల్నాడులో వేధింపులంటూ ప్రతిపక్షం అడ్డగోలు వాదనలు చేసిన వేళ, మంత్రులు సమాధానమిచ్చారు గాని జగన్ మాత్రం స్పందంచలేదు.

కోడెల విషయంలోనూ, బోటు ప్రమాదసంఘటనలోను ఎన్ని విమర్శలు వచ్చినా కూడా మౌనంగానె ఉన్నారు. కాని ఇలానె కొనసాగితే జగన్ కు కష్టాలు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పరిస్థితులు జేజారిపోతున్నాయి.అసలు విషయానికి వస్తే గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రభుత్వం. అయితే భర్తీలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలనుంచి విమర్శలు ఘాటుగా వస్తున్నాయి. కొశ్చన్ పేపర్ లీక్ అయ్యిందని ఉద్యోగాలన్నికూడా వైసీపీ వాళ్లకే వచ్చాయిని ప్రతిపక్షా ఆరోపిస్తున్నాయి. దీనిపై నానాయాగి చేస్తున్నాయి.

ఈ అంశం లక్షలాది యువకుల జీవితాలకు సంబంధించిన అంశం కావడంతో ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారనుంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపనలు నిరుద్యోగుల్లోను, వారి కుటుంబాల్లోను అనుమానాలు తలెత్తెలా చేస్తున్నాయి.ఇప్పుడైనా జగన్ ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలి.

ప్రతిపక్షం పేలుతున్న అవాకులు చెవాకులన్నిటికీ ముఖ్యమంత్రి బదులు చెప్పాల్సిన పనిలేదు. కాని ప్రజలకు సంబంధించిన ప్రతి అనుమానాన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలే ప్రభుత్వానికి మచ్చగా మిగిలే ప్రమాదం ఉంది. జగన్ మాట్లాడితేనే ప్రతిపక్షాల నోళ్లు మూతపడతాయి. మరోవైపు ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న 18లక్షల కుటుంబాలకు కాస్తో కూస్తో సమాధానం లభిస్తుంది. ఇక ఇప్పటికే ప్రతిపక్షాలకు తోడు యెల్లో మీడియా గ్రామ సచివాలయ ఉద్యోగాలపై తీవ్ర రాద్ధాంతం చేస్తున్నాయి. పరిస్థితులు చేదాటిపోకముందే జగన్ క్లారిటీ ఇస్తే సరిపోతుంది. జగన్ స్పందన కోసం అటు రాష్ట్రప్రజలు, ఇటు రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికైనా జగన్ క్లారిటీ ఇస్తారా లేకా తన మౌనాన్ని కొనసాగిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -