Monday, April 29, 2024
- Advertisement -

పోలవరం పనులను దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ

- Advertisement -

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎప్పుడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ పద్దతికి శ్రీకారం చుట్టింది. అందులో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.గత వారం 65 వ ప్యాకేజీ పనులకు రివర్స్ టెండర్లు పిలిచిన ప్రభుత్వం.. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు రివర్స్ టెండర్లు నిర్వహించింది.

రివర్స్ టెండరింగ్ లో జలవిద్యుత్ కేంద్రం, ప్రధాన డ్యాం పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది.రివర్స్ టెండర్లతో ప్రభుత్వానికి రూ.628 కోట్ల భారీ లబ్ధి చేకూరింది. అంచనా వ్యయం కంటే 12.6 శాతం తక్కువకు బిడ్ ఖరారైంది. వ్యయం అంచనా రూ.4987 కోట్లు కాగా రూ.4,358 కోట్లకు మేఘా సంస్థ బిడ్ దాఖలు చేసింది.గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు పనులు చేపట్టేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది.

దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయాంగా పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించింది. రెండుపనులకు రూ.4,987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా మేఘా సంస్థ ఒక్కటే టెండర్ దాఖలు చేసింది. దీంతో టెండర్ మేఘా సంస్థకు ఖరారైంది. కోర్టునుంచి అనుమతులు రాగానె మేఘా సంస్థపనులను ప్రారంభించనుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం టెండర్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న నిర్ణయం గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -