Monday, May 5, 2025
- Advertisement -

టీటీడీలో మొద‌ల‌యిన ప్ర‌క్షాల‌న‌.. జేఈవో శ్రీనివాస‌రాజు బ‌దిలీ

- Advertisement -

ఏపీ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీ జేఈవో శ్రీనివాస‌రాజుపై బ‌దిలీ వేటు వేసింది ప్ర‌భుత్వం. శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసరాజును జేఈడీకి బదిలీ చేసింది. టీటీడీ జేఈవోగా బసంత్‌కుమార్ నియమిస్తూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

నివాసరాజు గత ఎనిమిదేళ్లుగా టీటీడీ జేఈవోగా పని చేస్తున్నారు. 2011లో రెండేళ్ల కాలపరిమితితో జేఈవోగా బాధ్యతలు పూర్తి చేసుకున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. గత ప్రభుత్వాలు నాలుగు సార్లు జేఈవోగా శ్రీనివాసరాజును కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. అయితే సుదీర్ఘ కాలంగా టీటీడీ జేఈవోగా శ్రీనివాసరాజు కొనసాగుతుండటంతో తాజాగా ఆయన్ను బదిలీచేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బసంత్‌కుమార్ ఇప్పటి వరకు వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పనిచేశారు. శ్రీనివాసరాజు దాదాపు 8ఏళ్లపాటు టీటీడీ జేఈవోగా బాధ్యతలు నిర్వహించారు. తక్షణ బాధ్యతలు చేపట్టాలని బసంత్‌కుమార్‌కు ప్రభుత్వం ఆదేశించింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -