Friday, April 19, 2024
- Advertisement -

తెలంగాణలో ఐఏఎస్ బదిలీలు!

- Advertisement -

ఈ మద్య తెలంగాణలో దుబ్బాకలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పరాజయం పొందిన విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంపై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేశారు. పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం ఉప ఎన్నిక పూర్తయిన నేపథ్యంలో సిద్దిపేట బాధ్యతను మళ్లీ వెంకటరామిరెడ్డికే అప్పగించింది. దుబ్బాక ఉప ఎన్నికకు ముందు మెదక్ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన సంగారెడ్డి కలెక్టర్ ఎం.హన్మంతరావును తిరిగి సంగారెడ్డికి బదిలీ చేసింది.

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా గత నెలలో సిద్దిపేట నుంచి సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన కలెక్టర్ వెంకటరామిరెడ్డిని మళ్లీ సిద్దిపేట కలెక్టర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికెరిని మళ్లీ మంచిర్యాలకు పంపించింది. ఆ జిల్లా  కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిక్తా పట్నాయక్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.

మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు బదిలీ కాగా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి మల్కాజిగిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శశాంకకు ఆ బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తూ ఆ స్థానంలో హొళికెరికి అదనపు బాధ్యతలు అప్పగించింది.

చైనా పై యుద్ధం ప్రకటించిన అమెరికా?

భారత్ నుంచి చైనాకు ఎగుమతులు కట్..!

ఢిల్లీ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం ..!

ఇప్పట్లో బడులకు మోక్షం లేనట్టేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -