Wednesday, May 22, 2024
- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ సర్కారు సంచలన నిర్ణయం

- Advertisement -

ఓ వైపు ‘స్థానికత’పై తెలంగాణ సర్కారు గగ్గోలు పెడుతోంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తామంటే కుదరదంటూ ‘స్థానికత’ను నిర్ధారించేందుకు ఏకంగా సమగ్ర సర్వేనే చేపట్టింది.

మరోమారు ఈ తరహా సర్వేను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా ఏపీ సర్కారు పయనిస్తోంది. 

సీమాంధ్రులే కాకుండా నిర్ణీత గడువులోగా తన భూభాగంలోకి ఎవరు వచ్చినా ‘స్థానికత’ను ఇచ్చేస్తామని ప్రకటించింది. అయితే కేవలం అలాంటి వారు కేవలం స్థిర నివాసం మాత్ర చూపాల్సి ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు నిన్న ‘స్థానికత’పై ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 

2017, మార్చి 31లోపు తన పరిధిలోకి వచ్చిన వారందరికీ ‘లోకల్’ స్టేటస్ ఇస్తామని ఇటీవల ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం, అందుకనుగుణంగా పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -