Tuesday, May 21, 2024
- Advertisement -

అయ్యో…నిహారిక!!?

- Advertisement -

వారం రోజుల క్రితం టాలీవుడ్ లో కొణిదెల నిహారిక‌ పేరు బాగా వినిపించింది. మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా వచ్చి తమ సత్తాను చాటుకుంటున్నారు. వారిలో మూడో త‌రం హీరోలుగా కూడా కొంద‌రు స్టార్ స్టేట‌స్ హోదా అనుభ‌విస్తున్నారు. అలాంటిది ఈ మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‍గా తొలిసారి నిహారిక ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది.

నిహారిక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఒక మనసు చిత్రం కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూశారు. అయితే ఈ ఒక మనసు చిత్రం తొలి రోజే బోరింగ్ సినిమా అన్న టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపేడుతుంది అని ఆశలు పెట్టుకున్న నిహారికకు ఈ చిత్రం నిరాశ మిగిల్చింది. దాంతో ఈ చిత్రం తర్వాత నిహారిక కనిపించడమే మానేసింది.

ప్రమోషన్స్ కూడా రావడం లేదు. దీంతో ఇప్పుడు నిహారిక ఏం చేస్తుందా అని ఆరా తీస్తే ఒక మ‌న‌సు రిజ‌ల్ట్ ఆమెను బాగా భాదపేదుతుందట. అందుకే ఆమె అస్స‌లు బ‌య‌ట‌కే రావ‌డం లేద‌ట‌. అయితే ఒక మ‌న‌సు చిత్రంలో నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ చాలా చోట్ల మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ కనబడకపోవడంతో కొన్ని విమ‌ర్శ‌లు వచ్చాయి. అయితే తొలి చిత్రం కావడం వల్ల ఇలాంటి విమ‌ర్శ‌లు పటించుకోవడం అవసరం లేదు అంటున్నారు. మరి ఇప్పుడు నిహారిక సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్న వినిపిస్తోంది. చిరంజీవికి ముందు నుంచే నిహారిక హీరోయిన్ అవ్వ‌డం ఇష్టంలేద‌నే టాక్ వినిపిస్తోంది. చిరు అయితే ఇప్ప‌టికైనా ఆమెతో సినిమాలు మానిపించేయాల‌ని చూస్తున్నాడ‌ట‌.

Related

  1. నిహారిక సినిమాని కోసి పడేసారు
  2. చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్ – నిహారిక
  3. నిహారికకు అదిరిపోయే చాన్స్??
  4. నిహారిక ప్రశ్నకు షాక్ అయిన నాగబాబు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -