ప్రముఖ పార్మాస్యుటికల్ కంపెనీ అరబిందో ఫార్మాస్ కు లాభాల పంట పండింది. 2016 మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి 562.85 కోట్ల రూపాయల నికర లాభం వచ్చింది. ఇది గతంతో 39.4 శాతం ఎక్కువని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో అరబిందో కంపెనీకి 403.80 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి.
ఈ త్రైమాసికంలో 18.5 శాతం లాభాల పెరుగుదలతో 3162 కోట్ల రూపాయల నుంచి 3746 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇక ఈ త్రైమాసికంలో నిర్వహణ లాభాల మార్జిన్ 23.5 శాతం ఉంది. 2015 – 2016 ఆర్ధిక సంవత్సరానికి 13,896 కోట్ల రూపాయల రాబడిపై 1982 కోట్ల రూపాయల నికరలాభం వచ్చినట్లుగా కంపెనీ ప్రకటించింది.
గత ఆర్ధిక సంవత్సరంలో అమెరికా ఎఫ్ డి ఎ నుంచి 58 ఎఎన్ డిఎలకు అనుమతి లభింంచిందని, ఫలితాలు ఎంతో బాగుండడంతో 70 శాతం మధ్యంతర డివిడెండ్ కు కంపెనీ బోర్డు సిఫార్సులు చేసిందని కూడా అరబిందో కంపెనీ అధికారులు తెలిపారు.