Friday, May 17, 2024
- Advertisement -

బాహుబలి డైలాగ్ తో టీడీపీ అభిమానులకు తలనొప్పి!

- Advertisement -

భారీ ఎత్తున విడుదల అయిన “బాహుబలి’ సినిమా అభిమానులను అమితంగా ఆనందపెడుతోంది. తెలుగు సినీ చరిత్రలో అత్యంత భారీ చిత్రంగా విడుదల అయిన ఈ సినిమాను పోటీలు పడి చూశారు అభిమానుంతా.

ఇది ఒక విజువల్ వండర్ అని ప్రశంసిస్తున్నవారూ ఉన్నారు.. మరీ అంతగొప్ప సినిమా కాదు.. రాజమౌళి నుంచి మరింత  ఎక్స్ పెక్ట్ చేశామని అంటున్నవాళ్లూ ఉన్నారు. మరి ఇలాంటి వారి సంగతిలా ఉంటే ఇప్పుడు బాహుబలి డైలాగులు కూడా వైరల్ గా వ్యాపిస్తున్నాయి.

సినిమాలో సూపర్ అనిపించుకొన్న డైలాగులను ఇంటర్నెట్ లో ప్రచారానికి పెట్టారు అభిమానులు. అలాంటి వాటిలో ఒకటి మాత్రం బాగా మార్మోగుతోంది. ఇది పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అభిమానులను ఇబ్బంది పెడుతుండటమే ఇక్కడ విశేషం! “కత్తిపోటు కన్నా.. బల్లెం పోటు కన్నా.. దారుణమైనది వెన్నుపోటు..” అనే డైలాగ్ బాగా హైలెట్ అవుతోంది. బాహుబలి – ది బిగినింగ్ క్లైమాక్స్ లో ఈ డైలాగ్ వస్తుందని తెలుస్తోంది!

మరి రాష్ట్రంలో వెన్నుపోటు విమర్శలను బాగా ఎదుర్కొన్న వ్యక్తి తెలుగుదేశం అధినేత. ఎన్టీఆర్ నుంచి పదవిని సొంతం చేసుకోవడం కోసం బాబు వెన్నుపోటు పొడిచాడనే ఇమేజ్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. బాబు ప్రత్యర్థులు ఆయనపై తరచూ వెన్నుపోటు ఆరోపణలు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు బాహుబలిలో వెన్నుపోటు గురించి పవర్ ఫుల్ డైలాగ్ తెలుగుదేశం పార్టీ అభిమానులను ఇబ్బంది పెడుతోంది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -