Sunday, May 19, 2024
- Advertisement -

కేసీఆర్ తీరు.. ఆయన కూతురు కవితకే నచ్చలేదు!

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీఆర్ఎస్ లో తప్పు పట్టేవాళ్లు ఎవరూ లేరు.. అనుకొంటున్నారంతా. తెలంగాణకే సుప్రీమోగా మారిన కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని బయటవారు ఎంతో మంది విరుచుకుపడుతున్నారు.

అనేక విషయాల్లో వారు కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, కమ్ తెలంగాణ ముఖ్యమంత్రిపై వారు విరుచుకుపడుతున్నారు. మరి ఇలా బయటి వాళ్ల విమర్శల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు తెలంగాణ సీఎంను ఇంట్లో వాళ్లే విమర్శిస్తున్నారు. వీరే కేసీఆర్ తీరును తప్పుపడుతున్నారు.

ముఖ్యమంత్రిగా తండ్రి వ్యవహారంపై స్పందించారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కల్వకుంట్ల కవిత. కేసీఆర్ క్యాబినెట్ లో మహిళా మంత్రులు ఎవరూ లేకపోవడం గురించి కవిత స్పందించారు. ఇది చాలా బాధాకరమైన అంశం అని ఆమె అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయినా.. ఇప్పటి వరకూ ఆయన క్యాబినెట్ లో ఏ మహిళకూ స్థానం దక్కలేదు. ఆదిలో ఏర్పాటు చేసుకొన్న క్యాబినెట్ తోనే కేసీఆర్ బండి లాగిస్తున్నారు.

ఈ సందర్భంగా తాజాగా ఒక మహిళా కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. తన తండ్రి క్యాబినెట్ లో మహిళలకు స్థానం దక్కకపోవడం గురించి స్పందించారు. మహిళా సాధికారికత కోణం నుంచి చూస్తే.. ఇది అంత మంచి పరిణామం కాదని కవిత అభిప్రాయపడ్డారు! మరి ఈ విషయం ఆమె తన తండ్రికి సూటిగా చెప్పి.. పునర్వ్యస్థీకరణకు ఏర్పాట్లు చేయించవచ్చు కదా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -