Wednesday, May 15, 2024
- Advertisement -

బాహుబలి లా చేసి.. ప్రాణాలు కోల్పోయాడు

- Advertisement -

సినిమాలో హీరోలు చేసే పెద్ద పెద్ద స్టంట్లు నిపుణుల ఆధ్వర్యంలో.. తగిన రక్షణతో చేస్తారు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే కొందరు నిజ జీవితంలో హీరో అనిపించుకోవాలనే ఆశతో రిస్కీ స్టంట్లని స్వయంగా చేయడానికి పూనుకుంటారు. ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. బాహుబలిలో జలపాతం దగ్గర ప్రభాస్‌ దూకే సీన్ చూసి.. ఒక వ్యక్తి బాగా ఇన్‌స్పయిర్‌ అయి అది నిజంగా చేద్దామని చేసి.. చనిపోయాడు.

ముంబయి మిర్రర్‌ కథనం ప్రకారం ఇంద్రపాల్‌ పాటిల్‌ అనే ముంబయికి చెందిన వ్యాపారస్తుడు బాహుబలిలా దూకేస్తానంటూ షాహాపూర్‌లోని మహులి కోట వద్ద జలపాతంలోకి దూకాడు. ల్యాండింగ్‌ సరిగా లేక అక్కడికక్కడే ప్రాణాలొదిలేసాడు. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ అసలు జలపాతం దగ్గర దూకనే లేదు. నిజానికి అక్కడ అసలు జలపాతమే లేదు. గ్రాఫిక్స్‌తో కనికట్టు చేసి అది నిజంగా చేసిన భ్రమ కలిగించారు.

అయితే ప్రభాస్ కొన్ని అడుగుల ఎత్తు నుంచి రోప్స్‌ సాయంతో దూకితే అది నిజంగా దూకినట్టు దర్శకుడు రాజమౌళి చూపించారు. ఇదంతా పట్టించుకోకుండా రియల్‌ బాహుబలి అనిపించుకుందామని చూసి చనిపోయాడు. ఇలాంటి వార్తలు తరుచూగా వస్తున్న.. ఇలాంటి పనులు ఎందుకు చేస్తారో.. ఎందుకు ప్రాణాలు కోల్పోతారో అర్ధం కావడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -