Thursday, May 2, 2024
- Advertisement -

ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు అన్ని విధాల దౌత్యమార్గాలను అనుసరిస్తున్నాం…

- Advertisement -

నెల‌రోజులుగా డోక్లాంలో రోడ్డు నిర్మాణం చేప‌ట్టాల‌ని చూస్తోన్న చైనా ఆగ‌డాల‌కు భార‌త్ చెక్ పెట్ట‌డంతో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ రోజు రాజ్యసభలో ప్ర‌క‌ట‌న చేశారు.

సిక్కిం వివాదంలో భారత్‌ ఎలాంటి అసంబద్ధ విషయాలు చెప్పట్లేదని, ఈ విషయంలో ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా ఉన్నాయని సుష్మా చెప్పారు. సరిహద్దు వివాదం చైనా, భూటాన్‌ మధ్యే ఉన్నంతవరకు భారత్‌ ఎలాంటి చర్యలు చేపట్టదన్నారు. కానీ.. ఎప్పుడైతే అది భారత్‌-టిబెట్‌-భూటాన్‌ జంక్షన్‌ వరకు వస్తుందో అది మన దేశ భద్రతపై ప్రభావం చూపుతుందని సుష్మా స్వరాజ్‌ స్పష్టం చేశారు. రోడ్డు నిర్మాణంపై ఇప్పటికే పలుమార్లు చైనాను హెచ్చరించినట్లు తెలిపారు.

చైనా బుల్డోజర్స్, నిర్మాణ పరికరాలు తీసుకొని డొక్లాం జంక్షన్‌కు వచ్చిందని, అది మన భద్రతకు ముప్పు అని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. తమను తాము రక్షించుకునేందుకు భారత్ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -