వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. భాస్కర్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
అలాగే గతంలో అవినాశ్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని దస్తగిరి వేసిన పిటిషన్‌ను కొట్టేసింది న్యాయస్థానం. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయలేమని తేల్చి చెప్పింది. అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు.
రాజకీయ ఉద్దేశంతోనే, నిరాధార ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ వేశాడని,హైకోర్టు కండీషన్ షరతులు ఎక్కడ ఉల్లంఘించలేదని న్యాయస్థానానికి విన్నవించారు నాగార్జున రెడ్డి. సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు లేవని తెలపగా ఆయన వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు దస్తగిరి పిటిషన్ కొట్టివేసింది.