విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ధగా చేసిందని దానికి నిర్సనగా వైసీపీ ఎంపీలు తమ పదువులకు రాజీనామాలు చేశారు. ఎట్టకేలకు ఈరోజు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించారు.
తప్పని పరిస్థితుల్లో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం.. ఏపీలో బై పోల్స్ అయితే జరిగే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఉప ఎన్నికలు జరగాలంటే.. గెలిచిన వ్యక్తి కనీసం పదవిలో ఏడాది కాలమైనా ఉండాలనే నిబంధన ఉందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. మరో పది నెలల్లోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ రావొచ్చు.
ఉప ఎన్నికలు జరిగినా.. గెలిచే వారి పదవీ కాలానికి ఏడాది వ్యవధి కూడా ఉండదు. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల వరకూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ సీట్లను ఖాళీగానే ఉంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతనిజముందో కొద్ది రోజుల్లో తేలనుంది.
