Wednesday, May 1, 2024
- Advertisement -

ప్రచారంలో బాలయ్య ‘లయన్’ గర్జించడం లేదు!

- Advertisement -

నందమూరి నటసింహం సినిమా వస్తున్న ఛాయలు ఏవీ? అది కూడా బాలయ్య సెంచరీకి దగ్గరపడ్డ వేళ వస్తున్న సినిమాకు ఉండాల్సిన సందడి ఇదేనా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకా… బాలయ్య ఎమ్మెల్యే అయ్యాకా.. వస్తున్న తొలి సినిమాకు ఎలాంటి సందడి ఉండాల్సింది?

చివరగా “లెజెండ్” తోసూపర్ హిట్ ను కొట్టిన హీరో సినిమా వస్తుందంటే ఎంత ఆర్భాటం ఉండాల్సింది?!

అయితే ఇంత నేపథ్యం ఉన్నా… ‘లయన్’  గర్జించడం లేదు. ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా విడుదల అవుతోంది.. అసలు ఈ సినిమా విడుదలు అవుతున్న విషయం అభిమానులకు అయినా సరిగా తెలుసా? లేదా? అనేది అర్థం కావడం లేదు. ఇంతకు ముందు “లెజెండ్” విడుదల సమయంలో చాలా సందడి కనిపించింది. 

ఆ సినిమా విడుదల ముందు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తింది. బాలయ్య గర్జించబోతున్నాడని అనిపించింది. అయితే లయన్ విషయంలో మాత్రం ఈ లోటు కనిపిస్తోంది. బాలయ్య సినిమా రేపు విడుదల కాబోతోందంటే.. నమ్మలేని పరిస్థితి ఇది. ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాలేవీ ఇంత డల్ గా విడుదల కాలేదు! 

“లయన్” ఆ లోటును భర్తీ చేస్తోంది. మరి సినిమా విడుదల అయ్యి.. అభిమానులను మరీ ఆకట్టుకొంటే కానీ.. ఇండస్ట్రీలో ఈ సినిమా హడావుడి మొదలయ్యేలా లేదు. మరి అంత వరకూ  వెయిట్ చేయడమే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -