Thursday, May 16, 2024
- Advertisement -

గూగుల్ దెబ్బకు.. లోకేష్ అబ్బా..!

- Advertisement -

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తీరుతో తెలుగుదేశం యువనేత లోకేష్ బాబు కు ఒక విధమైన దెబ్బే తగిలింది. అమెరికా టూర్ లో ఉన్న ఆయనకు ఈ అమెరికన్ కంపెనీనే చిన్న షాక్ ఇచ్చింది.

లోకేష్ బాబు డైరెక్ట్ గా గూగుల్ సంస్థతో కానీ.. ఆ సంస్థ ప్రతినిధులతో కానీ ఎలాంటి చర్చలూ.. జరపకపోయినా.. పెట్టుబడులను తీసుకురావడం విషయంలో వారితో సంప్రదింపులేమీ జరపకపోయినా… పరోక్షంగా లోకేష్ బాబు రాజకీయాలను ప్రభావితం చేసింది గూగుల్!

ఆసియాలోనే అతి పెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నదట గూగుల్. అమెరికాలోని  ఆ సంస్థ ప్రదాన కార్యాలయం తర్వాత ఇదే అతి పెద్దది అవుతుందని తెలుస్తోంది. ఈ క్యాంపస్ లో కొత్తగా ఆరువేల ఐదువందల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారట. దీంతో ఇక్కడ గూగుల్ ఆఫీసులో పనిచేసే వారి సంఖ్య రెట్టింపు కానుంది. కొత్తగా వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కూడా గూగుల్ సిద్ధం అయ్యింది.

మరి అమెరికా వెళ్లి ఒంటిచేత్తో ఈ పనులను చక్కబెట్టుకొని వచ్చాడు తెలంగాణ మంత్రి కేటీఆర్.  తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తనయుడు అయిన కేటీఆర్ అమెరికా టూర్ తో ఇవన్నీ సాధించుకొని వచ్చాడు. మరి ఇదే సమయంలో ఏపీ సీఎం తనయుడు లోకేష్ బాబు కూడా అమెరికా వెళ్లాడు!

ఈ ఇద్దరు యువనేతలూ ఒకేసారి అమెరికా టూర్ కు వెళ్లారు. తమ తమ ఇమేజ్ లను పెంచుకొనేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో లోకేష్ బాబుఏవో దత్తత కార్యక్రమాలు మాత్రం చేయగలిగాడు. అమెరికాలోని ఎన్ ఆర్ ఐలు ఏపీలో ని గ్రామాలను దత్త తీసుకొంటారని లోకేష్ బృందం ప్రకటించింది. అయితే అది ఏ మేరకు విజయవంతం అవుతుంది? అనేది చెప్పలేని పరిస్థితి.

అయితే కేటీఆర్ టూరుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోంది. గూగుల్ హైదరాబాద్ క్యాంపస్ ను తీర్చిదిద్దుతున్న విధానాన్ని జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. దీంతో కేటీఆర్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. మరి ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ బాబుకు ఇది మింగుడుపడే అంశం అయితే కాదు.ఈ విధంగా గూగుల్ డీల్ లోకేష్ కు ఇబ్బందికరంగా మారింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -