టికెట్‌కోస‌మే శిల్పా పార్టీ మారితే… మ‌రి మంత్రిప‌ద‌వికోస‌మే అఖిల టీడీపీలో చేరారా..?

Bhuma Akhila Priya Fires on Shilpa Mohan Reddy

ఇత‌ర పార్టీల త‌రుపును గెలిచిన ప్ర‌జాప్ర‌తినిధులు తాయిలాల‌కు ఆశ‌ప‌డి అధికార‌పార్టీలోకి వ‌ల‌స‌లు వెల్ల‌డం రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఈమ‌ధ్య‌కాలంలో సాదార‌నం అయ్యింది.ప‌ద‌వుల‌కోసం ఆశ‌ప‌డి వెల్లిన వాల్లు నీతులుమాట్లాడితే అంత‌కంటె సిగ్గుచేటు మ‌రొక‌టి ఉండ‌రు.దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుంటుంది.

విష‌యానికి వ‌స్తే నంద్యాల ఉప ఎన్నిక ఇరు పార్టీలకు చావోరేవో అన్న సంస‌గ‌తి తెలిసిందే.అయితే అభ్య‌ర్తుల మ‌ధ్య రాజ‌కీయ మాట‌లు తూటాల్లా పేలుతున్నాయి.టికెట్ కోస‌మే శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలోకి వెల్లార‌ని మంత్రి అఖిల‌ప్రియ విమ‌ర్శించ‌డంతీరు చూస్తె విడ్డూరంగా అనిపిస్తుంది.

{loadmodule mod_custom,GA1}

టీడీపీలో శిల్పా సీనియ‌ర్ నాయ‌కుడు.నంద్యాల నియేజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న నేత‌. ఆయనకు నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వను అని చంద్రబాబుగారు చెప్ప‌డంతో… అదే సమయంలో వైకాపా తరపున టికెట్ ఇస్తానని జగన్ చెప్పాడంతో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
టికెట్ కోసం శిల్పా మోహన్ రెడ్డి పార్టీని మారాడు.. అంటూ మోరల్ పోలిసింగ్ చేసింది మంత్రి భూమా అఖిలప్రియ.గుర‌వింద త‌న న‌లుపు ఎరుగ‌న‌ట్లు భ‌లేగా మాట్లాడింది అఖిల‌ప్రియ‌.వైకాపా తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన తను, తన తండ్రి ఆ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.ఇప్పుడు ఏకంగా మంత్రి ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు.
అఖిల రాజీనామా చేయరు? పార్టీ మారి కూడా అవతల పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేద‌ని అని అంతా నిలదీస్తున్నా.. భూమా కుటుంబం విలువలతో కూడిన రాజకీయం చేయలేకపోయింది.
ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారి అందరికీ ఆదర్శంగా నిలవలేకపోయింది. ఒక పార్టీ ద్వారా ఎమ్మెల్యే పదవిని సంపాదించుకుని.. మరో పార్టీలోకి వెళ్లి ఫిరాయింపుకు పాల్పడి.. మంత్రి పదవిని కూడా పొందిన అఖిలప్రియ ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి విలువలు పాటించడం లేదని అనడం త‌మాషాగా ఉంది.

{loadmodule mod_custom,GA2}

పిరాయింపు ద్వారా మంత్రి ప‌ద‌విని పొందిన అఖిల‌ప్రియ …శిల్పా టికెట్ కోస‌మే వైసీపీలో చేరార‌ని నీతుల‌కు నిర్వ‌చ‌నాలు ఇస్తోంది.మ‌రి అఖిల ప్రియ చేసిందేమిటి …?

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}L8BYt4M8RN4{/youtube}