Sunday, May 12, 2024
- Advertisement -

బాబు ప్ర‌బుత్వానికి హైకోర్టు దిమ్మ‌తిరిగే షాక్‌…

- Advertisement -
Alla Ramakrishna Reddy welcomes high court verdict on sadavarthi satram lands

సదావర్తి భూముల విషయంలో రాష్ట్రప్రభుత్వానికి చుక్కెదురైంది. గుంటూరు జిల్లాలోని సదావర్తిసత్రానికి రాష్ట్రంతో పాటు తమిళనాడులో కూడా భూములున్నాయి. మిగితా భూములు అన్యాక్రాంతమౌతున్నట్లే ఈ భూములు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే రాష్ట్రప్రభుత్వంలోని పెద్దలు పావులు కదిపారు.

తమకు కావాల్సిన వారికి అత్యంత ఖరీదైన తమిళనాడులోని 84 ఎకరాలను కట్టబెట్టాలని అనుకున్నారు. రాజు తలచుకుంటే దేనికి కొదవ? అందుకే చంద్రబాబునాయుడుకు బాగా సన్నిహితుడైన కాపుకార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ్యకు కేవలం రూ. 22 కోట్లకే కట్టెబెట్టేసింది.

{loadmodule mod_custom,GA1}

ఎప్పుడైతే విషయం బయటకు పొక్కిందో వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసు వేసారు. సరే, కేసన్నాక రెండు వైపులా వాదనలు ఉంటాయికదా? విచారణ సందర్భంగా కోర్టు ప్రభుత్వ వైఖరిపై బాగా తలంటింది.వేలం పాటను రద్దు చేసి భూములను ప్రభుత్వమే వెనక్కు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. కానీ సదరు భూములను అంతకంటే ఎక్కువ ధరకు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ప్రభుత్వం వాదించింది.
దీంతో చివరకు హైకోర్టు 22 కోట్లకు అదనంగా మరో 5 కోట్లు ఇస్తే మీకే భూములు ఇచ్చేస్తామని పిటిషనర్‌ ఆర్కేకు సూచించింది. దీంతో స్పందించిన ఆర్కే హైకోర్టు ఆదేశానికి అంగీకరిస్తున్నట్టు చెప్పారు. తన దగ్గర అంత డబ్బు లేదని కానీ 22 కోట్లకు అదనంగా ఐదు కోట్లు చెల్లించేందుకు కొందరు సిద్దంగా ఉన్నారని కోర్టుకు తెలియజేశారు. రెండు వారాల్లో 10 కోట్లు, నాలుగు వారాల్లో మిగిలిన 17 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. దీనికి హైకోర్టు అంగీకరించింది.

{loadmodule mod_custom,GA2}

హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి దిమ్మతిరిగింది. ఎందుకంటే, ఆళ్ళ లెక్కల ప్రకారం సదరు భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 800 కోట్లుంటుంది.అప్ప‌నంగా త‌క్కువ ధ‌రకే కొట్టేయ‌ల‌ని చూసిన బాబు,ఆయ‌న మ‌ద్ద‌తుదారుల‌కు మింగుడుప‌డ‌ని అంశం.బాబు ఆడిన నాట‌క అడ్డంతిరిగింది ఇప్పుడు బాబు చేంచేస్తారో …..?

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}04zibTFZ0mU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -