Friday, March 29, 2024
- Advertisement -

వ్యాక్సిన్ పై బైడెన్ ప్రకటన..!

- Advertisement -

కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధిలో ఇటీవల గణనీయమైన పురోగతి కనిపించిందన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. అందులో పలు వ్యాక్సిన్లు ప్రభావవంతంగా ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ ఏడాది డిసెంబర్​ చివర్లో లేదా జనవరి తొలినాళ్లలోనే టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్​ పంపిణీ చేసేందుకు సరైన ప్రణాళికను రూపొందించాలని, అది తాము చేసి తీరుతామన్నారు బైడెన్​. అయితే.. దానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు.

అమెరికా ఈజ్​ బ్యాక్​ అని ప్రకటించారు అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. తన బృందం.. అగ్రరాజ్యాన్ని తిరిగి అగ్రస్థానానికి చేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -