Thursday, April 25, 2024
- Advertisement -

విచ్చల విడిగా తిరుగుతున్న.. అమెరికన్లు..!

- Advertisement -

కరోనా మరోసారి విజృంభిస్తున్నా అమెరికన్లు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ‘థాంక్స్ గివింగ్’ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలను పెడిచెవిన పెట్టి ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. కానీ, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య చాలా మేరకు తగ్గింది.

‘థాంక్స్ గివింగ్’ సందర్భంగా విమాన ప్రయాణికులు తీవ్రంగా పెరిగారు. ఈ తరుణంలో జాతీయ విమానాశ్రయాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. విమానాశ్రయాల్లో టెర్నినల్స్, రాపిడ్​ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరిన తర్వాత క్వారంటైన్​లో ఉండేలా చర్యలు చేపడుతున్నాయి.

ప్రస్తుతం అమెరికాలో కోటి మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. దాదాపు 2,69,000 మంది మరణించారు. రోజుకు లక్ష 74 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ తరుణంలో ప్రజలు ప్రయాణాల వైపే మెుగ్గు చూపడం మరింత ప్రమాదకరంగా మారనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -