Wednesday, May 8, 2024
- Advertisement -

అన్నదాతల ఆగ్రహ జ్వాలలు.. రణరంగంగా మారిన ఢిల్లీ సరిహద్దు!

- Advertisement -

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా విజృంభన కొనసాగుతుంది.. ఈ నేపథ్యంలో ఈ ఆందోళనకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కానీ అన్నదాతలు మాత్రం ఈవేవీ పట్టించుకోకుండా తమ ఆందోళన చేపట్టారు. దాంతో ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హరియాణా రైతులను సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. 

తమ ఆవేదన పట్టించుకోవడం లేదన.. తమకు అడ్డుకుంటున్నారని అన్నదాతలు ఆగ్రహించారు. అయితే రెండు నెలలుగా రైతులు తమ రాష్ట్రంలో శాతియుతంగా నిరసన తెలియజేస్తూ ఎటువంటి సమస్యలు సృష్టించలేదన్నారు. తాము నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్తోన్న రైతులను అత్యంత క్రూరంగా సైన్యం సాయంతో అడ్డుకోవడం అప్రజాస్వామ్యమని, రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ‘కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం. వాటిని వెనక్కి తీసుకోవడానికి బదులు ఆందోళన చేస్తున్న రైతులపై వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -