Sunday, May 19, 2024
- Advertisement -

గాలి జనార్థనరెడ్డి కూతురు పెళ్లి ఆగిపోతుందా ?

- Advertisement -
Big notes tension in Gali family marriage

మన దేశంలో జరిగే బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ మీద అందరికీ ఆసక్తులుండడంకామన్. పెళ్లి పత్రికల నుంచి పెళ్లి చీరలు.. పెళ్లి వంటకాల దాకా అన్నిటిమీదా బ్రేకింగ్ న్యూసే. ఈసారి 200 కోట్ల బడ్జెట్ తో జరిగే బళ్లారిఘనుడు గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లి మీద దేశమంతా ఓ కన్నేసి ఉంచింది.

ఈనెల 16న జరగబోయే ఈ  వివాహ వైభోగానికి సడన్ గా ఓ బ్రేకొచ్చిపడింది. పెద్ద నోట్లను బ్యాన్ చేసిన మోదీ సర్కార్..బళ్ళారిలో వాటి చెలామణీకి గండి కొట్టేసింది. ఇటు.. వంద కోట్ల ఖర్చుతో వెయ్యి రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు బడాయిగా స్టేట్ మెంట్ వచ్చేసింది.

క్యాటరింగ్ కంపెనీ వాళ్లయితే ఇప్పుడు తల పట్టుకుని కూర్చుండిపోయారు. ప్రతి చిన్న కొనుగోలుకీ పెద్దనోట్లతోనే పనిబడ్డం.. ఆ పెద్ద నోట్లన్నీ బైటికి తీసే ధైర్యాలు లేకపోవడం.. ఈ గందరగోళంతోనే ఇప్పుడు గాలి వారి పెళ్లిసందడికి బ్రేకులు పడిపోయినట్లయింది. కనీవినీ ఎరుగని రీతిలో కూతురి పెళ్లి చెయ్యాలన్న గాలివారి కల నెరవేరాలని ఆయనఅభిమానులు కోరుకుంటున్నారు. మధ్యలో ఈ నల్ల మరియు పెద్ద  నోట్ల బెడద ముంచుకొచ్చిందని తెగ చికాకు పడిపోతున్నారు. ఇప్పుడు కన్నడ మీడియాలో ఈ వార్తలే హల్ చల్ చేస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -