Thursday, May 16, 2024
- Advertisement -

బాబోయ్ పాకిస్తాన్ కి మోడీ మరొక భారీ షాక్

- Advertisement -
Modi Shocks to Pakistan over Ban High Value Notes

పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో బ్లాక్ మనీ బడా బాబులకు దిమ్మ తిరిగిపోయిందని చెప్పాలి. అయితే.. ఈ మాట అందరూ చెప్పేదే. కానీ.. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దాయాది పాకిస్థాన్ కు నోట మాట రాకుండా చేసిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

రూ.500.. రూ.వెయ్యి నోట్లకు సంబంధించిన నకిలీ దందాను పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని.. ఆ నోట్లతో భారత ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయాలని చూస్తుందన్న హెచ్చరికలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. అయితే.. దీన్ని ఎలా కట్టడి చేయాలో అర్థం కాక గత ప్రభుత్వాలు కిందామీదా పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు ఆ ప్రభుత్వాలు తీసుకోకపోవటం.. పెద్ద నోట్లను దేశంలోకి డంప్ చేస్తూ ఆరాచకాన్ని సృష్టిస్తున్న దాయాదికి మోడీ తాజా నిర్ణయం దిమ్మ తిరిగిపోయినట్లేనని చెప్పాలి.

హవాలా పద్ధతిలో పాక్ తో సహా పలు దేశాల నుంచి భారత్ లోని స్లీపింగ్ సెల్స్ కు పెద్ద ఎత్తున నిధులు అందుతున్న విషయం తెలిసిందే. మోడీ తీసుకున్న తాజా నిర్ణయంతో అలాంటి వాటికి చెక్ పెట్టటమే కాదు.. హవాలా మార్గంలో వచ్చే వందలాది కోట్లకు చెక్ పడినట్లేనని చెబుతున్నారు.  రూ.500.. రూ.2వేల కొత్త నోట్లు రావటం.. వాటిని కాపీ కొట్టటం క్లిష్టంగా మారటం.. మరోవైపు చిన్న నోట్లను హవాలా మార్గంలో తరలించటం సాధ్యం కాదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో మోడీ దాయాదికి మరో భారీ షాక్ ఇచ్చారని చెప్పక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -