Saturday, May 4, 2024
- Advertisement -

త‌నీష్ నువ్వు కెప్టెన్ అవ్వ‌డానికి ఏం అర్హ‌త ఉంది : నాని

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజన్‌పై మొద‌ట్లో నెగిటివ్ కామెంట్స్ వినిపించిన దానిని దాటుకుని షోని న‌డిపిస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్ నాని.మిగ‌త వారాల‌తో పోలిస్తే శ‌ని,ఆదివార‌ల‌లో షోకి రేటింగ్స్ బాగున్నాయి.ఇక ఈ శ‌నివారం మంచి హుషారుగా ఎంట్రీ ఇచ్చాడు నాని.ఇక ఎప్ప‌టిలాగే త‌నదైన శైలిలో హోస్‌మెట్స్‌పై రెచ్చిపోయాడు నాని.ముఖ్యంగా త‌నీష్‌ను టార్గెట్ చేసిన నాని , ఏం అర్హ‌త ఉంద‌ని నువ్వు(త‌నీష్‌) కెప్టెన్‌గా ఎంపిక అయ్యావ‌ని ప్ర‌శ్నించాడు నాని. ఇక గత వారం రోజులుగా మహిళలు, పురుషులు మధ్య జరిగిన ‘అంతిమ యుద్ధం’, ‘రంగు రబ్బా.. రబ్బా’.. టాస్క్‌లు వాటిలో కంటెస్టెంట్స్ పెర్ఫామెన్స్ గురించి హాట్ హాట్ టాపిక్ నడిచింది. ఇక బిగ్ బాస్ హౌస్‌కి రెండో సారి కెప్టెన్ అయిన తనీష్‌కు చుక్కలు చూపించారు నాని. అంతిమ యుద్ధం టాస్క్‌లో నీ అంతట నువ్ ఆడి గెలిచింది ఒక్క గేమ్ కూడా లేదు.

అలాంటిది నువ్ ఎలా కెప్టెన్ అయ్యావని నాని ప్రశ్నించడంతో నీళ్లు నమిలాడు తనీష్. గోల్డ్ కాయిన్స్ దొంగిలించాడని కౌశల్‌ని నిందించినప్పుడు.. పూజా విసిరేసిన కాయిన్స్‌ను నువ్ ఎలా తీసుకుంటావని ప్రశ్నించారు నాని. మేం ఇచ్చిన టాస్క్ ఒకటైతే .. మీరు ఆడిన టాస్క్ ఒకటని.. అసలు ఒక్క గేమ్‌లో కూడా గెలవని తనీష్‌ను కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారంటూ తనీస్ బ్యాచ్‌కి క్లాస్ పీకారు నాని. ఇక ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న బాబు గోగినేని, శ్యామల, తనీష్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు,గణేష్‌లలో ఇద్దరు సేఫ్ అయ్యారు. యాంకర్ శ్యామల, సింగర్ గీతా మాధురిలు ఈ వారం ఎలిమినేషన్‌ నుండి సేఫ్ అయినట్టు ప్రకటించారు నాని. ఇక రేపటి ఎపిసోడ్‌లో బాబు గోగినేని, తనీష్, దీప్తి, గణేష్‌లలో ఒకరు బ్యాగ్ సర్దేయాల్సిఉంటుంది. మరి ఆ ఒక్కరు ఎవరన్నది ఆదివారం నాటి ఎపిసోడ్‌లో తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -