- Advertisement -

బిగ్‌బాస్‌ 10వ సీజన్ వచ్చేస్తోంది!

- Advertisement -

బుల్లితెర ప్రేక్షకులను దశాబ్ద కాలంగా విశేషంగా అలరిస్తూ.. తిరుగులేని టీఆర్‌పీ రేటింగులతో దూసుకుపోతున్న మోస్ట్ పాపులర్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ (Bigg Boss Telugu) సరికొత్త మైల్‌స్టోన్‌ను తాకడానికి సిద్ధమైంది. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్లను పూర్తి చేసుకుని ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని పంచిన ఈ బిగ్గెస్ట్ షో.. ఇప్పుడు గ్రాండ్‌గా 10వ సీజన్‌ (Bigg Boss Telugu 10) లోకి అడుగుపెట్టబోతోంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఈ క్రేజీ గుడ్‌న్యూస్‌ను ప్రేక్షకులకు అందజేస్తూ ఒక పవర్‌ఫుల్ అఫీషియల్ ప్రోమో వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

“బిగ్‌బాస్.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం” అంటూ నాగార్జున తన మార్క్ రాయల్ వాయిస్‌తో చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ 10వ సీజన్ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసిన ఒక మాస్ సాంగ్ వీడియోలో మేజర్ హైలైట్‌గా నిలిచింది. ‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అనే సరికొత్త ట్యాగ్‌లైన్‌ను మేకర్స్ ఈ సారి ఫిక్స్ చేశారు. దీన్ని బట్టి రాబోయే కొత్త సీజన్ అంతకుమించి అనేలా ఎంత రసవత్తరంగా, కఠినమైన టాస్కులతో ఉండబోతుందో ముందే హింట్ ఇచ్చేసింది బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్.

ఇక గత సీజన్ (బిగ్‌బాస్ 9) లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు (Common Man) కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అగ్ని పరీక్షలను దాటుకుని ఆరుగురు సామాన్యులు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చారు. చివరకు ఊహించని విధంగా ఒక సామాన్యుడు (కల్యాణ్ పడాల) ‘బిగ్‌బాస్ 9’ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో.. మరి ఈ ల్యాండ్‌మార్క్ 10వ సీజన్‌లో కూడా సామాన్యులకు ఛాన్స్ ఇస్తారా? లేక కేవలం సెలబ్రిటీలతోనే హౌస్ నింపేస్తారా? ఈ సారి వచ్చే కంటెస్టెంట్లు ఎవరు? అసలు షో ఎప్పుడు గ్రాండ్‌గా లాంచ్ అవ్వబోతోంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో బుల్లితెర ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. వీటన్నింటికీ అఫీషియల్ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

https://www.youtube.com/embed/ioObElfXAoE?si=J0t9cCooOXyOET78

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -