- Advertisement -

నిస్వార్ధంగా పని చేసినా గుర్తింపు లేదు..టీడీపీ నేత ఆవేదన

- Advertisement -

టీడీపీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు తో ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఖరారు చేసారు. పలువురు రేసులో ఉన్నా.. ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేసారు. సుదీర్ఘ కసరత్తు తరువాత ముగ్గురి పేర్లను టీడీపీ ప్రకటించింది. దీంతో, ఆశావాహులు ఆశలు ఫలించలేదు. కొందరిని టీడీపీ నాయకత్వం బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది. ఈ సమయంలోనే రాజ్యసభ సీటు ఆశించిన కడప నేత సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అవుతోంది.

టీడీపీ నుంచి కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డపగారి శ్రీనివాస రెడ్డి రాజ్యసభ సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. పార్టీ నాయకత్వాన్ని పలు మార్లు కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు రాజ్యసభ సీటు పైన హామీ దక్కిందని ఆయన సన్నిహితులు చెబుతూ వచ్చారు. కీలకమైన కడప జిల్లాకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారమూ సాగింది. తాజాగా టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు రాజ్యసభకు ఖరారయ్యారు. సీట్లు దక్కని వారితో ముఖ్య నేతలు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేసారు. అయినా.. కడప జిల్లా నేత రెడ్డపగారి శ్రీనివాస రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన బయట పెట్టారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.

శ్రీనివాస రెడ్డి చేసిన పోస్టులో..” గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది. కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను..” అని పోస్టు చేసారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -