Friday, May 17, 2024
- Advertisement -

హాల్ టికెట్‌పై బికినీ ఫొటో.. విద్యార్థిని షాక్‌

- Advertisement -

ఏదైనా ప‌రీక్ష‌లు రాయ‌డానికి విద్యా సంస్థ‌లు హాట్ టికెట్లు అందిస్తాయి. అందులో ఒక‌టికి రెండుసార్లు పేర్లు, ప‌రీక్ష‌, ప‌రీక్ష కేంద్రం త‌దిత‌ర వివ‌రాలు చూసుకోవాల‌ని చెబుతారు. ఆ అన్నీ క‌రెక్టే ఉంటాయ‌ని భావిస్తారు. ఆ నిర్ల‌క్ష్య‌మే కొంప‌ముంచేట‌ట్టు ఉంది. ఇప్పుడు అలాంటిదే ఓ విద్యార్థిని కొంప‌ముంచింది.

హాల్ టికిట్‌పై త‌న ఫొటో కాకుండా ఓ మ‌హిళ అర్ధనగ్నంగా ఉన్న ఫోటో వచ్చింది. ఈ ఘటన బీహ‌ర్‌లోని లలిత్ నారాయణ్ మిథిలా విశ్వ‌విద్యాల‌య పరిధిలో చోటు చేసుకుంది. పాట్నాలోని మధుబాని ఎస్ఎంజే క‌ళాశాల‌లో ఓ విద్యార్థిని సైన్స్ గ్రూపు (ఫైనలియర్) చదువుతోంది. మిథిలా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం (ఏప్రిల్-10) నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ప‌రీక్ష‌లు రాసేందుకు యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి తన హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. హాల్‌ టికెట్‌లో తన ఫొటోకి బదులుగా బికినీ ధరించి ఉన్న ఓ మహిళ ఫొటో ప్రింటయ్యింది . దీంతో షాక్‌కు గురైన ఆ విద్యార్థిని ఈ విషయాన్ని విశ్వ‌విద్యాల‌య అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అప్లై చేసుకున్నప్పుడు తన ఫొటోనే అప్‌లోడ్ చేయ‌గా ఇప్పుడు ఆ ఫొటో ఎలా వ‌చ్చిందో తెలియ‌ద‌ని చెప్పింది.

యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ కుల్‌ నంద్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. బాధిత విద్యార్థినికి కొత్త హాల్‌ టికెట్‌ను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

2017 అక్టోబర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఫస్టియర్ బీకామ్ విద్యార్థి ఫోటోకు బదులుగా హాల్‌ టికెట్‌లో వినాయకుడి బొమ్మను ముద్రించారు. ఆన్‌లైన్‌లో జరిగే తప్పిదాల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -