Saturday, April 20, 2024
- Advertisement -

స్కూళ్ల‌ల్లో ప్రేయ‌ర్ మ‌ధ్యాహ్నం చేయించాలి.. కేంద్ర సంస్థ‌ల నిర్ణ‌యం

- Advertisement -

పిల్లల్లో డీ విటమిన్ లోపాన్ని అధిగమించే లక్ష్యంతో ఆరోగ్య భద్రతా నియంత్రణ సంస్థ, భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రాజెక్ట్ ధూప్‌ను సోమవారం ప్రారంభించింది. ఇందుకోసం పాఠశాలల్లో ఉదయం చేసే ప్రార్థనను మధ్యాహ్నానికి మార్చాలని ప్రతిపాదించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటలోపు ప్రార్థన నిర్వహిస్తే సూర్యరశ్మి నుంచి పిల్లలు గరిష్టంగా విటమిన్ డీని పొందగలరని తెలిపింది.

జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ), న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ), నార్త్ ఎంసీడీ స్కూళ్లతో కలిసి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా సూర్యరశ్మి సమృద్ధిగా లభిస్తున్నా 90 శాతం మంది బాలబాలికల్లో విటమిన్ డీ లోపం పెరుగుతోందని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

ఉదయం ప్రార్థనను మధ్యాహ్నానికి మార్చడంతో సూర్యరశ్మి బాగా అంది పాఠశాల విద్యార్థులకు సరిపడా విటమిన్ డీ పొందగలరని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో పవన్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తాము ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రాజెక్ట్ ధూప్ కార్యక్రమం విటమిన్ డీ పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తున్న‌ట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చైర్మన్ ఆశిష్ బహుగుణ తెలిపారు.

స్కూల్స్ లో ప్రేయర్ (ప్రార్థన, అంసెబ్లీ) టైంని మార్చాలని నిర్ణయించింది. ఇందుకు తగ్గట్టుగానే పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీని పేరు ప్రాజెక్ట్ థూప్. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ప్రార్థన చేయించాలని పాఠ‌శాల‌ల‌కు సూచిస్తోంది. ఎండ, గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలోనే ఈ ప్రేయర్ నిర్వహించాలని కోరుతోంది. దీనివల్ల పిల్లలపై సూర్యరశ్మి పడి విటమిన్ డి అనేది దానంతట‌ అదే శరీరంలోకి వెళ్తుంద‌ని భావ‌న‌. చేతులు, కాళ్ల నొప్పుల సమస్యకి ఇది చక్కటి పరిష్కారం అని చెబుతోంది. ఢిల్లీలోని కొన్ని పాఠశాలల్లో ప్రాజెక్ట్ థూప్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి.

ప్రార్థన సమయాల్లో మార్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి నివేదిక ఇచ్చి అమలు చేసే విధంగా ప్రయత్నాలు కూడా ప్రారంభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -