డిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు కేజ్రీవాల్ డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారంటూ మాజీ మంత్రి ఆప్ బహిష్కృతనేత కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలపై భాజాపా సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి స్పందించారు.
గతంతలో కూడా కేజ్రీపై విమర్శలు గుప్పించిన ఆయన ఇప్పుడు తాజగా కేజ్రీ 420 విదేశాల నుంచి ఆయనకు డబ్బు వస్తుందనే విషయంలో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. ఆప్ పెద్ద దేశద్రోహ పార్టీ. దేశ రాజకీయాలను నాశనం చేసేందుకే ఆ పార్టీని స్థాపించారు’ అని స్వామి ఆరోపించారు.
కేజ్రీపై స్వామి ఆరోపనలు చేయడం ఇదేమి కొత్తకాదు. 2013 లో కూడా ఆయన కేజ్రీవాల్ పేరును శ్రీ 420 అని మార్చుదాం’ అంటూ స్వామి ట్వీట్ చేశారు.అప్పటి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మధ్య విభేదాలు తలెత్తిన సమయంలోను ‘కేజ్రీవాల్ లాగే జంగ్ కూడా ఓ 420’ అని వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు ఈ ఆరోపనలు సంచనంగా మారాయి.
Related