Thursday, May 16, 2024
- Advertisement -

ఫేస్ బుక్ జుకర్ బర్గ్ తన కూతురికి ఆ దేశం పేరు పెట్టుకుంటాడట!

- Advertisement -

యువతరంలో మంచి క్రేజ్ ఉన్న అంతర్జాతీయ స్థాయి వ్యాపారవేత్తల్లో ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ ముందుంటాడని వేరే చెప్పనక్కర్లేదు. మరి యువతలో ఈ రకంగా ఫాలోయింగ్ ఉన్న జుకర్ బర్గ్ కొంత కాలం కిందట తండ్రి అయ్యాడు.

జుకర్ బర్గ్ దంపతులు ఒక పాపాయికి జన్మనిచ్చారు. మరి ఇప్పుడు విశేషం ఏమిటంటే ఆ పాపాయికి చైనీ పేరు పెట్టుకోవాలనేది అతడి కోరికగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జుకర్ వెల్లడించాడు. అది కూడా చైనా అధ్యక్షుడి వద్ద. ఇటీవల చైనా అధ్యక్షుడు అమెరికా పర్యటనకు వెళ్లాడు. ఆ సమయంలో అతడికి అమెరికా అధ్యక్షుడు విందు ఇచ్చాడు. ఈ విందుకు జుకర్ కూడా హాజరయ్యాడు.

ఈ విందులో జుకర్ చైనా అధ్యక్షుడు తో తన కోరికను విన్నవించుకున్నాడు. తమ పాపకి చైనీ పేరు పెట్టాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పుకున్నాడట. అయితే చైనా అధ్యక్షుడు మాత్రం జుకర్ పాపకి పేరు పెట్టే బాధ్యతను తీసుకోలేమని అనేశాడని సమాచారం. అది చాలా పెద్ద బాధ్యత అని అందుకే తాను ఆ బాధ్యత తీసుకోలేకపోతున్నానని చైనా అధ్యక్షుడు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.

దీంతో జుకర్ చేసేదేమీ లేకపోయింది. మరి చైనా పేరును తన తనయకు పెట్టుకోవాలని మార్క్ ప్రయత్నించినా ఆ ప్రయత్నం ప్రస్తుతానికి ఫలించినట్టుగా లేదు. మరి జుకర్ బర్గ్ స్వయంగా ఏదైనా పేరును అన్వేషించుకొంటాడు.. లేక చైనీ పేరును పెట్టాలనే ఆలోచనను మానుకొంటాడో వేచి చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -