Thursday, May 23, 2024
- Advertisement -

బోయపాటికి బంపర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు!?

- Advertisement -

షార్ట్ పిలిం షూటింగ్ కోసం పుష్కర పుణ్యస్నానాలకు వచ్చిన ప్రజలను గంటల కొద్ది నిల్చోబెట్టి చంద్రబాబు షూటింగ్ చేయించారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త మీడియాలో మాత్రం హల్చల్ చేస్తోంది. 

చంద్రబాబు జాతీయ మీడియాలో, ఇంటర్నేషనల్ స్టేజ్లో  షార్ట్ పిల్మ్ చూపించి ప్రమోట్ చేసుకోవాలని చాలా ఖర్చు పెట్టి తీశారని, ఈ సినిమా తీసినందుకు డైరెక్టర్ బోయపాటి శ్రీను కు రెండు రోజులే పట్టినా, ఇంతవరకూ ఎన్నడూ లేని విదంగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఫిల్మ్నగర్ వర్గాల టాక్. రెండు రోజులకు గాను 7కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కావాలని బోయపాటి చంద్రబాబును డిమాండ్ చేశాడట.

షాక్కు గురైన చంద్రబాబు చేసేది ఏమి లేక ఆ సదరు డబ్బును ఇచ్చినట్లు సమాచారం. ఇదే నిజమయితే ఆంద్రపదేశ్ లోటు బడ్జెట్లో ఉందని పదేపదే చెప్పే చంద్రబాబు, ప్రచారానికి ఏ మాత్రం తగ్గినట్లు కనిపించడంలేదనుకోవాలి. ఒక ప్రక్క ప్రతిపక్షాలు వీటిపైనా ఎంత విమర్శించినా, చంద్రబాబు మాత్రం ఏమి పట్టనట్లుగా తన పని తాను చేసుకుపోతున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక డైరెక్టర్ బోయపాటి కూడా ఇలాంటి షార్ట్ ఫిల్మ్ కేవలం రెండు రోజుల్లో తీసి 7కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న మొట్టమొదటి డైరెక్టర్గా పేరు పొందారని డైరెక్టర్ను పొగిడేస్తున్నారు. చంద్రబాబుకు ఈ ఫిల్మ్తో పేరు వస్తుందో రాదో కాని బోయపాటి మాత్రం అరుదైన రికార్డ్ సోంత చేసుకున్నట్లే అని ఇండస్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి.        

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -