Sunday, May 12, 2024
- Advertisement -

అయినా హన్సికకు అతడి మీద ప్రేమ తగ్గలేదు!

- Advertisement -

తనను హన్సిక వదిలేసి వెళ్లిందని అంటాడు శింబు. గత రెండు సంవత్సరాలుగా తనకేదీ సరిగా జరగలేదని.. అన్నీ నెగిటివ్ గానే జరిగాయని.. ఇలాంటి ఎదురుదెబ్బల్లో హన్సిక దూరం కావడం కూడా ఒక ఎదురుదెబ్బ అని కూడా శింబు చెప్పుకొచ్చాడు.

మరి హన్సిక, శింబుల ప్రేమ ఆ విధంగా వార్తల్లోకి వచ్చింది. తమ ప్రేమ సమయంలో హన్సిక, శింబులు ఆ విషయాన్ని ధ్రువీకరించలేదు.

బ్రేకప్ అయ్యాకా మాత్రం వారు ఇద్దరూ ఆ విషయం గురించి మాట్లాడారు. హన్సిక తనకు దూరం అయ్యిందని శింబు బాధఫడగా.. హన్సిక మాత్రం ఈ విషయం గురించి తను ఇప్పుడేం మాట్లాడలేను అని చెప్పుకొచ్చింది. ఈ విధంగా ఈ హీరోహీరోయిన్లు… తమ ప్రేమ గురించి మాట్లాడారు. మరి ఇప్పుడు విశేషం ఏమిటంటే.. శింబు విషయంలో హన్సిక చాలా ప్రేమతోనే ఉంది!

తాజాగా శింబు సినిమా ‘వాలు’ విడుదలకు ఇబ్బంది పడుతోంది. ఆ సినిమా విషయంలో హన్సిక సానుభూతి వ్యక్తం చేసింది. విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ సినిమాకు మద్దతుగా నిలబడుతున్నట్టుగా ప్రకటన చేసింది! మరి మనుషుల మధ్య దూరం పెరిగినా.. హన్సిక, శింబుల మనసుల మధ్య మాత్రం దూరం తగ్గలేదేమో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -