Thursday, May 2, 2024
- Advertisement -

ప్రియురాలి కోసం క‌ట్టుకున్న భార్య‌ను క‌డ‌తేర్చాడు..

- Advertisement -

సినిమాలు మ‌నుషుల‌ను మారుస్తున్నాయా? లేక మ‌నుషుల ప్ర‌వ‌ర్త‌న‌ల‌నే సినిమాలు తీస్తున్నారా అనేది అర్థం అవ‌డం లేదు. బంధాల‌ను, బంధుత్వాల‌ను మ‌రిచి ఎంతో మంది మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అలాంటి ఘ‌ట‌న మ‌రోటి జ‌రిగింది. త‌న ప్రియురాలికోసం క‌ట్టుకున్న భార్య‌ను హ‌త్య చేసి సినిమా స్టైల్ లో నాట‌కం ఆడాడు ఖ‌మ్మం జిల్లాకు చెందిన నాగ‌శేషు రెడ్డి.

పెళ్లికి ముందే వేరే యువతితో నాగ‌శేషు రెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయినా కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆయ‌న బుద్దిని మార్చుకోకుండా పెళ్లై 2 నెలలు తిర‌గ‌క ముందే భార్యను కాటికి పంపేశాడు. ఇంకా పోలీసుల ముందు ముస‌లి కన్నీళ్లు కార్చేశాడు. సర్ రెండు రోజులుగా నా భార్య కనిపించటంలేదు, ఎలాగైనా మీరే వెద‌కాలి అంటే దీనంగా ప్రార్దేయ‌ప‌డ్డాడు.

అయ్యే ఎంత బాధ‌లో ఉన్నాడ‌ని అత‌న్ని ఎవ‌రూ అనుమానించ‌లేదు. అయ‌న ప్రేమ‌పై ఎంతో జాలి చూపించారు. కానీ చివ‌ర‌కు త‌న భార్య‌ను నాగ‌శేషురెడ్డే చంపేశాడ‌ని పోలీసుల నిర్థార‌ణ‌లో తేలింది. దాంతో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన‌ నాగశేషురెడ్డికి ఇప్ప‌డు జైలు రుచిని పోలీసులు చూపిస్తున్నాడు.

భార్య‌ను న‌మ్మించి.. క‌డతేర్చిన క‌సాయి భ‌ర్త‌..!

కూతురితో పాటు ఇంటిపైనుంచి దూకిన త‌ల్లి

వ‌రుడు.. ఫొటోగ్రాఫర్.. మ‌ధ్య‌లో వ‌ధువు ! ప‌డిప‌డి నవ్వుకుంటారు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -