Monday, April 29, 2024
- Advertisement -

జిమ్ లో హీట్ ఎక్కిస్తున్న మిల్కీబ్యూటీ!

- Advertisement -

గత ఏడాది కరోనా నేపథ్యంలో స్టార్లు అందరూ ఇంటికే అంకితం అయ్యారు. ఈ మద్యనే షూటింగ్ లు మళ్లీ మొదలయ్యాయి. గత కొంత కాలంగా  మన హీరోయిన్స్ చాలా మంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. యోగా, వ్యాయామాలు చేస్తూ తన అందాలు షేర్ చేస్తున్నారు. ఇక తమన్న కూడా తనకు సంబంధించిన చాలా విషయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.

 ఆ మద్య కాస్త బొద్దుగా తయారైన తమన్నా లాక్ డౌన్ సమయంలో జిమ్ములో బాగా కసరత్తు చేస్తూ వచ్చి మంచి స్లిమ్ గా తయారైంది. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తుంది. రీసెంట్‌గా బ్లాక్ ప్యాంట్, రెడ్ క‌ల‌ర్ టాప్ ధ‌రించిన త‌మ‌న్నా హాట్ లుక్స్‌తో హీటెక్కిస్తుంది.

టీనేజ్‌లోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమన్నా ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. గోపిచంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సీటీమార్’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఏప్రిల్‌లో 2న ఈ సినిమా విడుదల కానుంది.  ఇక  నితిన్ సినిమా ‘అంధాదున్’ రీమేక్‌లో  బోల్డ్ పాత్రలో నటించబోతుంది.  మ‌రోవైపు వెంకటేష్, వరుణ్ తేజ్,..  ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ లో నటిస్తోంది.

’హరిహర వీరమల్లు‘గా రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ !

హీరో సూర్యకు కరోనా..

స్టైలిష్ స్టార్ ఊరమాస్ లుక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -