కుటుంబ కలహాలు రోజు రోజుకు ఎక్కువైతున్నాయి. ఆ సమయంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఎంతో నష్టాన్ని మిగులుస్తున్నాయి. అట్లాంటి దారుణం మరోటి హైదరాబాద్ శివారులో జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఒక యువతి తన భర్తపై మరుగుతున్న నూనెను పోసేసింది. ఆ కాలుతున్ననూనెతో పాటు కారాన్ని కూడా చల్లింది. ఆ తర్వాత తన కూతురుతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ ఘటన జగద్గిరిగుట్టలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఇక స్థానికుల తెలిపిన వివరాల్లోకి పోతే.. హుస్నాబాద్‌కు చెందిన సదయ్య, రజిత జగద్గిరిగుట్ట దీనబందు కాలనీలో ఉంటున్నారు. సదయ్య కూరగాయల వ్యాపారం చేస్తాడు. పోయిన నెలలో భర్తతో గొడవపడ్డ రజిత.. అమ్మగారింటికి వెళ్లింది.
పెద్దలు సర్ధిబాటుతో గత వారం ఇంటికి తిరిగి వచ్చింది. అయినా కానీ వీరి మధ్య గొడవలు తగ్గలేదు. ఇక మంగళవారం యధావిధిగా కురగాయలు అమ్మడానికి పోయిన సదయ్య మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో ఉండే బయటకేళ్లి తాలం వేసినట్లు సదయ్య గుర్తించి తలుపును తట్టాడు కానీ ఎంతకీ తలుపు తీయకపోవడంతో.. ఇల్లుపైనుంచి ఇంట్లోకి వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మళ్లీ ప్రారంభం అయ్యింది. ఈ సమయంలో ఆవేశానికి లోనైన రజిత భర్తపై వేడి వేడి నూనె, కారం చల్లింది.తర్వాత కూతురును తీసుకుని వెళ్లిపోయింది.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రున్ని హాస్పిటల్ కు తరలించారు. దీనిపై కేసు నమొదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
ఆదిపురుష్ లో ప్రభాస్ తల్లిగా ఆమే..!
పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకున్న కేడిగాళ్లు.. చివరకు ఏం జరిగిందంటే..!
భారీ ఆఫర్ ను కొట్టేసిన యాంకర్ రష్మీ ?