Wednesday, May 15, 2024
- Advertisement -

ట్రెండింగ్ అమ్మాయిపై పోలీసుల‌కు ఫిర్యాదు

- Advertisement -

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ సృష్టిస్తూ ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిన కేర‌ళ అమ్మాయిపై పోలీసుల‌కు కొంద‌రు కుర్రాళ్లు ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి చూపుల‌తో మ‌తి పోయామ‌ని కాదు.. త‌మ మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచారంటూ యువ‌కులు ఆరోపించారు. ‘ఒరు ఆదార్‌ లవ్‌’ అనే మలయాళ సినిమాలో త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తీశారంటూ హైదరాబాద్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫరూక్‌నగర్‌కు చెందిన కొంతమంది యువకులు ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా పాట తీశార‌ని ఆరోపించారు. ప్రియా ప్రకాశ్‌తో పాటు సినిమా నిర్మాత, దర్శకులపై చర్యలు తీసుకోవాలంటూ లిఖితపూర్వక ఫిర్యాదులో కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ప్రియాప్ర‌కాశ్ వారియ‌ర్ త‌న‌ క‌నుసైగ‌ల‌తో అంద‌ర్నీ సిగ్గుపడేలా చేసింది. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ త‌దిత‌ర సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తన కొంటె చూపులతో కుర్రకారు మనసులను అమాంతం దోచేసిన అమ్మాయి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. కేరళకు చెందిన ప‌దినిమిదేళ్ల ఈ అమ్మడుపై ఫిర్యాదుతో కొంద‌రు షాక్‌కు గురయ్యారు. ఆ అమ్మాయిపై ఎందుకు ఫిర్యాదు చేశార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=h-33NV7Dx9U

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -