Friday, May 10, 2024
- Advertisement -

టిడిపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అరెస్ట్….. జాతీయ స్థాయిలో టిడిపి పరువు గోవిందా

- Advertisement -

అవినీతి మరక అంటలేదు……జన్మలో ఎప్పుడూ ఒక్క తప్పు కూడా చెయ్యలేదు…..నిప్పులా బ్రతికాను అని నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రకటించుకుంటూ ఉంటాడు. కానీ ఆయనే స్వయంగా ఓటుకు కోట్లు కేసులో ‘బ్రీఫింగ్’ ఇచ్చి జాతీయ స్థాయిలో ఘనమైన అవినీతి నాయకుడిగా నేషనల్ మీడియాలో పేరు తెచ్చుకున్నాడు. ఇక బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన సుజనా చౌదరి, కబ్జా కేసుల్లో బుక్కయి ఉన్న టిడిపి ఎమ్మెల్సీ జేసీ దీపక్ రెడ్డి, ముస్లిం టీచర్‌ని వేధించిన మంత్రి కొడుకు సుశీలుడు, తన అధికారిక కార్యాలయంలోనే జూదం నిర్వహిస్తున్న టిడిపి ఎంపి, గుంటూరులో తన అధికారిక కార్యాలయాన్ని కబ్జా చేసి నిర్వహిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న మరో ఎంపి గల్లా జయదేవ్……అబ్బో అందరూ నిప్పులే.

ఇప్పుడిక మరో నిప్పు వ్యవహారం బయటపడింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి టిడిపి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకుని…..మరికొన్ని కోట్లు ఖర్చుచేసి ఎమ్మెల్సీగా గెలిచిన టిడిపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని బెంగుళూరులో సిబిఐ అరెస్ట్ చేసింది. బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన కేసులో బెంగుళూరులో పట్టుబడిన వాకాటి నారాయణరెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం రేపింది. ఇప్పటి వరకూ కనీసం ఖండన ప్రకటన కూడా చేయని చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్సీని సిబిఐ అరెస్ట్ చేసిన విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి. గతంలో దీపక్‌రెడ్డి విషయంలో కూడా చాలా తెలివిగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా అని చెప్పి…….దీపక్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి ముప్పురాకుండా కాపాడిన చంద్రబాబు…..ఈ సారి కూడా వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా అన్న డ్రామా డైలాగులే చెప్తాడేమో చూడాలి. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం……చేర్చుకోవడం ఎంత సేపు…..? నిప్పు నారా బాబును అని చెప్పుకునే చంద్రబాబు కనీసం తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నేతల పదవులు పోయేలా అయినా చేస్తే కాస్త సార్థకత ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. చంద్రబాబు అలాంటి ధైర్యం చేస్తే……తప్పు చేసి దొరికిపోయిన టిడిపి నేతలు…….‘ముందు నీ ‘బ్రీఫ్డ్ మీ’ సంగతేంటో చెప్పు అని నిలదీయకుండా ఉంటారంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -