Monday, May 5, 2025
- Advertisement -

జ‌గ‌న్ కేసుల‌నుంచి బ‌య‌ట ప‌డిన‌ట్టేనా….

- Advertisement -

గ‌తంలో ఏపీలో జ‌గ‌న్ అక్ర‌మాస్తు కేసు ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. జ‌గ‌న్ త‌న తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ల‌క్ష‌ల కోట్లు సంపాదించార‌ని అప్ప‌ట్లో కాంగ్రెస్‌,టీడీపీ లు కుమ్మ‌క్క‌య్యి జ‌గ‌న్‌మీద అక్ర‌మ కేసులు బ‌నాయించారు. జ‌గ‌న్ క్విడ్‌ప్రోకొకు పాల్ప‌డ్డార‌ని సీబీఐ కేసుల బ‌నాయించి 16 నెల‌ల‌పాటు జైల్లో పెట్టించారు బాబ అండ్ బ్యాచ్‌. అప్ప‌ట్లో టీడీపీ అనుకూల ప‌త్రిక‌లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికి దాన్ని ప‌ట్టుకొని వేలాడుతున్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు,ఆయ‌న ఆస్థాన మీడియాకు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. తాజాగా కేంద్రం డొల్ల కంపెనీల జాబితాలో దేశంలోని పలువురు ప్రముఖుల పేర్లు వినిపించాయి. అందులో మాజీ సీఎంలు, శశికళ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. తెలుగు నేతల విషయానికి వస్తే పలువురు టీడీపీ నేతల పేర్లు ఉన్నాయి. అందులో కేంద్రమంత్రి సుజనా చౌదరి, చంద్రబాబు సమీప బంధువు , స్టూడియో ఎన్ చానెల్ అధినేత నార్నే శ్రీనివాస్ , బాబుకి బాగా దోస్తులుగా మెలిగే రెడ్డి ల్యాబ్స్ అధినేతల పేర్లు ఉన్నాయి. అదే సమయంలో పలువురు బీజేపీ నేతల పేర్లు కూడా ఉన్నాయి. కానీ సర్కారు వారి జాబితాలో జగన్ పేరు వినిపించలేదు.

దేశవ్యాప్తంగా చర్చ రేకెత్తించిన డొల్ల కంపెనీలు వ్యవహారంలో జగన్ గుట్టు రట్టవుతుందని టీడీపీ అనుకూల వర్గాలన్నీ ఆశించాయి. ఏకంగా రెండు పత్రికలయితే పెద్ద పెద్ద వార్తలే రాసేశాయి. డొల్ల కంపెనీల బండారం బయటపడబోతోంది..జగన్ వ్యవహారమంతా వెలుగులోకి వస్తుందని జోస్యం చెప్పాయి. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా సదరు మీడియా సంస్థలన్నీ మూగ‌బోయాయి.

దాంతో ఇప్పుడు టీడీపీ వర్గాలకు మింగుడుపడని పరిణామంగా డొల్ల కంపెనీలు మారిపోయాయి. అధికార పార్టీ ప్రచారం పూర్తిగా ఢొల్లతనంతో కూడినదని స్పష్టమవుతోంది. జగన్ ని బద్నాం చేయడానికి చేసిన ప్రచారమేనని వైసీపీ నేతలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు. విపక్ష నేత పేరు వినిపించి ఉంటే చర్చోపర్చలు సాగించాలని సిద్ధపడిన వాళ్లకు సీన్ రివర్స్ కావడం గొంతులో వెలక్కాయపడ్డట్టయ్యింది. దీనిమాద బాబు అండ్ బ్యాచ్ ఎలా స్పిందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -