Tuesday, June 18, 2024
- Advertisement -

బాలకృష్ణ కి తలనొప్పి గా మారిన చంద్రబాబు ?

- Advertisement -

సినిమాలతో పాటు రాజకీయంగా కూడా సూపర్ ఇమేజ్ సంపాదించుకునే పనిలో పడ్డాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే బాలయ్య బాబు కి రాజకీయాలు మింగుడు పడ్డం లేదు అంటున్నారు విశ్లేషకులు.  తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పుకున్నా, ఆ అవకాశమే బాలకృష్ణకి దక్కని పరిస్థితి. 

ఓ పక్క బావ చంద్రబాబు, ఇంకోపక్క అల్లుడు లోకేష్పార్టీలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు బాలయ్యకు ఛాన్సివ్వాలంటే, ‘కుటుంబ పాలన’ అనే విమర్శలొస్తాయన్న సాకు చంద్రబాబుకి ఎటూ వుందనుకోండి.. అది వేరే విషయం.  సో బాలయ్య కి పెద్ద పోస్ట్ ఇవ్వడం కష్టమే. మరొక పక్క హిందూపురం లో ‘పీ ఏ’ తో ఇబ్బందులు పడుతున్నాడు బాలకృష్ణ. 

రాజీనామాల ఎపిసోడ్ కూడా మొదలవడం తో పార్టీని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత బాలయ్య మీదనే ఉంది. పీ ఏ విషయం లో పార్టీ వారికి అసమ్మతి రగిలితే అది బాలయ్యే చల్లర్చాల్సి ఉంటుంది. ఇక్కడ రాజుకుంటున్న అసమ్మతి వెనక పార్టీ పెద్దలు ఉండడం బాలయ్య కి అగమ్యగోచరంగా మారింది. నియోజకవర్గ పనుల మీద బాలయ్య ఇటీవలే ఢిల్లీ వెళ్ళొచ్చారు. పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. దీనికీ ఏర్పాట్లు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబే. 

ఇప్పుడు నియోజకవర్గంలో అసమ్మతి వెనుక చక్రం తిప్పుతున్నది కూడా చంద్రబాబేనన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. అంటే, ఒకప్పుడు హరికృష్ణకు పొగపెట్టిన వ్యవహారమే ఇప్పుడు బాలకృష్ణ విషయంలోనూ రిపీట్అవుతోందనుకోవాలేమో. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -