క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌లు రకరకాలుగా ఆడాలని ప్రయత్నం చేస్తుంటారు. ధోని హెలికాప్టర్ షాట్, సెహ్వాగ్ అప్పర్ కట్, దిల్షాన్ దిల్‌స్కూప్, డివిలియర్స్ రివర్స్ స్వీప్ షాట్‌లు చూసుంటారు. కాని ఇప్పుడు శ్రీలంక బ్యాట్స్‌మెన్ చమురు సిల్వ వెరైటీగా ఆడాలనుకున్నారు కాని సీన్ రివర్స్ అయ్యింది.
ఎవరైనా వికెట్లు ముందే బ్యాటింగ్ చేస్తాడు. కానీ చమరా దీనికి వినూత్నంగా ఆలోచించాడు.. తన పేరిట ఓ షాట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడో లేక త్వరగా అవుట్ కావలనుకున్నాడో ఏమో కానీ వింతగా బ్యాటింగ్ చేసి నవ్వుల పాలయ్యాడు. లంక ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియా తెగ వైరల్ అయింది.
అసలు విషయానికి వస్తే శ్రీలంక బ్యాట్స్‌మెన్ చమర సిల్వా ఔటైన విధానం చూస్తే ‘ఇలాక్కూడా ఔటవ్వచ్చా?’ అనే సందేహం కలుగుతుంది. అతను వెరైటీగా ఔటైన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. కొలంబోలో ఎమ్‌ఏఎస్ హోల్డింగ్స్ పేరుతో జరిగిన ఓ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో యునిచెల జట్టుకు చమర సిల్వా కెప్టెన్‌గా ఉన్నాడు.
టీజే లంక జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భాగంగా మధుశంక వేసిన 20వ ఓవర్‌లో సిల్వా వెరైటీగా ఔటయ్యాడు. బంతిని ఎదుర్కునే ప్రయత్నంలో ఒక సెకనుపాటు ఆట నియమాలు మర్చిపోయాడు. బాల్‌ని ఎదుర్కునే ప్రయత్నంలో సిల్వా వికెట్ల వెనుకకు పరిగెత్తాడు. అప్పుడు మధుశంక వేసిన బంతి వేగంగా దూసుకొచ్చి వికెట్లను తాకింది. దీంతో సిల్వా ఔటయ్యాడు.
ఔట్ అయిన విధానంపై సోషియల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. సిల్వా కావాలనే ఔటయ్యాడని వారు అభిప్రాయపడుతున్నారు. సిల్వా భార్య అతన్ని త్వరగా ఇంటికి రమ్మంది… అందుకే ఇలా ఔటయ్యాడని వారు కామెంట్లు చేశారు.
#MercantileCricket | Chamara Silva attempting an outrageous shot in a Mercantile match between MAS Unichela and Teejay Lanka at P. Sara Oval. pic.twitter.com/tSCX6OxEqv
— Damith Weerasinghe (@Damith1994) November 20, 2017