Saturday, May 4, 2024
- Advertisement -

చందాకొచ్చ‌ర్ రాజీనామాపై పెరుగుతున్న ఒత్తిడి…?

- Advertisement -

వీడియోకాన్ గ్రూపునకు రూ.3,250 కోట్ల రుణం మంజూరు వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు బ్యాంకు సీఈవో చందాకొచ్చర్ పదవికి గండం ఏర్ప‌డింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా చందా కొచర్ పదవీ కాలం 2019 మార్చి 31 వరకు ఉంది. వీడియోాకాన్ గ్రూపునకు రుణం మంజూరు చేసినందుకు గాను ఆ సంస్థ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ ఆ తర్వాత చందాకొచర్ భర్త దీపక్ కొచర్ ఏర్పాటు చేసిన కంపెనీలోకి రూ.60 కోట్లకు పైగా నిధులు సమకూర్చినట్టు ఆరోపణలు వచ్చాయి. రుణం ఇచ్చినందుకు ప్రతిఫలంగానే ఇది ముట్టజెప్పినట్టు వార్తలు రావడంతో సీబీఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టింది.

చందా కొచ్చ‌ర్ పై వ‌చ్చిన ఆరోప‌న‌ల‌తో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు రెండుగా చీలింది. వీడియోకాన్‌ గ్రూప్‌కు ఇచ్చిన రుణ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేయడంతో, చందా కొచర్‌కు పదవి గండం తెచ్చిపెట్టింది. చందా కొచర్‌ రాజీనామా చేయాల్సిందిగా కొంతమంది బోర్డు సభ్యులు కోరుతున్నారు. మరికొంత మంది సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. చందా కొచర్‌కు అండంగా నిలుస్తున్నారు. ఇలా బ్యాంకు బోర్డు సభ్యులు రెండుగా చీలినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.

దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఐసీఐసీఐ బ్యాంకును ప్రైవేటు రంగంలో నంబర్ 2 బ్యాంకుగా నిలబెట్టడంలో చందాకొచర్ పాత్ర ఎంతో విలువైనది. సంస్థలో మూడు దశాబ్దాలుగా ఆమె పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఆమె ఎన్నో పర్యాయాలు గుర్తింపు పొందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -