Tuesday, May 14, 2024
- Advertisement -

బయట పడ్డ చంద్రబాబు అక్రమ ఆస్తులు.. !

- Advertisement -
Chandrababu Assets

1988లో కర్షక పరిషత్‌కు తన నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు జవాబుగా బాబు హైకోర్టులో తాను స్వయంగా అఫిడవిట్ దాకలు చేశారు. దాన్లో తన ఆస్తుల్ని వివరిస్తూ… నేను సంప్రదాయ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. మా కుటుంబానికి 77.4 ఎకరాల భూమి ఉంది. 1986 మార్చి నాటికి వ్యవసాయం ద్వారా మా కుటుంబానికి రూ.2.25 లక్షల ఆదాయం వచ్చింది.

1986లో మేం విడిపోయాం. ఆ తరవాత నేను స్వయంగా కూలీల్ని పెట్టి వ్యవసాయం చేశా. ఏడాదికి రూ.36,000 ఆర్జించా అని పేర్కొన్నారు. 1992-93 నాటికి రూ.76 లక్షల భారీ పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏర్పాటు చేసే స్థాయికి చేరారు. స్వయంగా వ్యవసాయం చేస్తూ ఏడాదికి రూ.36,000 ఆర్జించిన బాబు… ఆరేళ్లలో 76 లక్షలు ఎలా ఆర్జించారన్నది ఆయన చెబితే తప్ప నిజానికి 1983లో భువనేశ్వరి కార్బయిడ్స్, భువనేశ్వరి కార్బయిడ్స్ అండ్ అల్లాయ్స్ అనే సంస్థల్ని ఏర్పాటు చేసినా… అవి సరిగా నడవక దివాలా తీయటంతో బ్యాంకు రుణాల్నీ ఎగ్గొట్టిన చరిత్ర బాబుది. మరి ఏ లాభాలతో హెరిటేజ్ పెట్టారన్నది ఆయన చెప్పాల్సిన పనిలేదా? 1994లో చంద్రబాబు సిఎం అయిన.. 1999లో నాటి స్పీకరు ఎదుట తన ఆస్తులు ప్రకటించారు.

తమ కుటుంబానికి రూ.7.79 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు చెప్పారు.  మరి ఇన్ని ఆస్తులెలా కూడబెట్టారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా ఏమైనా అన్ని కోట్ల లాభాలొచ్చాయా అంటే… ఆ సంస్థను ఆరంభించిన మొదట్లోనే పబ్లిక్ ఇష్యూకు తెచ్చారు. దానికి అప్పట్లో అంత భారీ డివిడెండ్లు కూడా రాలేదు. మరి ఆరేళ్లు తిరిగేసరికి అన్ని కోట్ల ఆస్తులెలా వచ్చాయి? 2009 నాటికి 60 కోట్లకు… ఐదేళ్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు సైతం రెట్టింపయ్యే పరిస్థితులు లేకపోయినా బాబు ఆస్తులు మాత్రం 2004 నాటికి రూ.20 కోట్లకు, 2009 నాటికి రూ.60 కోట్లకు చేరాయి. (అప్పుల్ని కలపకుండా). అయితే ఇవన్నీ బాబు అఫిడవిట్లో చెప్పినవి మాత్రమే. ఇక బాబు బినామీల పేరిట పెట్టిన ఆస్తుల్ని కూడా లెక్కపెడితే ఈ దేశంలోకెల్లా ధనికుడైన రాజకీయవేత్తగా బాబుకు ‘తెహల్కా’ డాట్‌కామ్ ఇచ్చిన టైటిల్ సార్థకమవుతుందన్నది కాదనలేని వాస్తవం.

{youtube}Lrpo5IMyefk{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -