- Advertisement -

జియో కి షాక్.. బీఎస్ఎన్‌ఎల్ ఊహించని ఆఫర్ ఇదే

- Advertisement -
Bsnl 10GB Data Per Day

టెలికం రంగంలో జియో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జియో ఇచ్చిన ఆఫర్స్ తో ఇతర కంపెనీలకు భారీ దెబ్బ పడింది. దాంతో ఆ కంపెనీలు కూడా దిగి వచ్చి.. కొత్త కొత్త ఆఫర్స్ ను ఇస్తున్నాయి. ఆ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది.

దేశంలో వైర్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల కింద రోజుకు 10 జిబి డేటాను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.  2 ఎంబిపిఎస్‌ స్పీడ్‌, ఉచిత ఇన్‌స్టలేషన్‌తో ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బిబి249 పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ప్లాన్‌లో భాగంగా నెలకు 249 రూపాయలు చెల్లించటం ద్వారా రోజుకు 10 జిబి డేటాను వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. డేటా డౌన్‌లోడ్‌కు అదనంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఏ నెట్‌వర్క్‌కు అయిన అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చని తెలిపింది.

నెలకి రూ. 249 చెల్లిస్తే రోజుకి డౌన్‌లోడ్, బ్రౌజింగ్ కోసం 10జీబీ డాటాను వాడుకోవచ్చు. అలాగే ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఆదివారం రోజు మొత్తం అపరిమిత కాల్స్ చేయొచ్చు. 

{youtube}0udbq-anfFY{/youtube}

{youtube}wG1HcN62ZwM{/youtube}

Related

  1. మార్చి 31 తర్వాత జియో సిమ్ పడేయకండి.. మరో సూపర్ ఆఫర్ ఇచ్చిన జియో
  2. జియో ఆఫర్… డిసెంబర్ వరకు ఫ్రీ ఇచ్చే ఆలోచనలో అంబానీ
  3. జియోకి పోటీ ఇచ్చిన ఐడియా.. సూపర్ ఆఫర్ ఇదే!
  4. సూపర్ ఆఫర్ : Redmi 4 స్మార్ట్ ఫోన్ 5000 రూ లకే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -