Sunday, May 12, 2024
- Advertisement -

అమరావతి ప్రజలకు తన స్టైల్ లో వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు..!!

- Advertisement -

చంద్రబాబు వెన్నుపోటు గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలిసిందే.. అయితే అప్పుడప్పుడే వాడిన ఈ ఆయుధాన్ని ఇప్పుడు తుప్పు వదిలిస్తూ అమరావతి ప్రజల మీద వాడబోతున్నారు చంద్రబాబు.. చంద్రబాబు తన హయాంలో ఎంత మంది వద్దన్నా అమరావతి ని రాజధాని చేసి తెప్ప చేశారు.. ఇప్పుడు తాను అనుకున్నది అయినా అయిందా అంటే అదీ లేదు.. జగన్ వచ్చి తన పని తాను చేశాడు.. ఆ తర్వాత అమరావతి కి అండగా ఉంటానని చెప్పి ధర్నాలు చేస్తూ కలం నెట్టుకొచ్చాడు..

కానీ జగన్ బాబు ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగిపోతూ మూడు రాజధానుల నిర్మాణంలో మునిగిపోయాడు.. అయితే ఇక్కడే అసలు ట్విస్టు ఉంది.. చంద్రబాబు ఏమనుకున్నాడో ఏమో, ఇకపై ఎన్ని చేసినా అమరావతి లో రాజధాని వచ్చేలా లేదు, ఎన్ని ధర్నాలు, రాస్తారోకో లు చేసినా జగన్ తిరిగి ఇక్కడికి రాజధాని తెచ్చేలా లేడు అనుకున్నాడో ఏమో తన వెన్నుపోటు బుద్ధిని చూపిస్తున్నాడు.. అమరావతి అంశం పై నిన్న జూమ్ లో చంద్రబాబు సహా పలువురు పార్టీ సభ్యులతో ఓ మీటింగ్ జరిగింది.. ఆ మీటింగ్ లో చంద్రబాబు చేసినా వ్యాఖ్యలు అమరావతి ప్రజలకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయి..

అమరావతి ని రాజధాని ప్రకటించిన రోజు ప్రజలు నాకోసం భూములిచ్చారా, చంద్రబాబు పై నమ్మకంతో కాదు, లేకపోతే ఒక వ్యక్తి కోసమో, పార్టీ కోసమో కాదు, రాష్ట్రం కోసం భూములిచ్చారు. రాజధాని కోసం భూమిలిచ్చారు. అని ఆయన చెప్పిన తీరు చూసి పార్టీ నేతలు సైతం ఆశ్చర్య పోతున్నారు.. ఇప్పటివరకు ఏది చేసినా తానే చేశాను, తానే నడిపించాను అని చెప్పుకునే బాబు ఇలా ప్లేట్ ఫిరాయించడంతో అమరావతి కి చెందిన నేతలు ఇప్పుడు ప్రజల ముందుకు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు.. భూసేకరణ పద్ధతి ప్రకారం పరిహారం చెల్లించకుండా లోప భూయిష్టమైన , పలు అవకతవకలకు అసకరం కల్పించిన భూసమీకరణ పద్ధతిలో రైతులను ఇరికించి ఐచ్చికంగా భూములు ఇస్తున్నట్లు, వారికిచ్చిన ప్లాట్స్ తీసుకోవడం తప్ప మరే విధమైన హక్కులు లేకుండా చేసిన ప్రయివేట్ డెవలప్మెంట్ తరహా అగ్రిమెంట్ తో భూములు తీసుకుని చెప్పిన విధంగా రాజధాని నిర్మించలేక తాత్కాలిక కట్టడాలతో సరిపెట్టుకున్న చంద్రబాబు ఈ రోజు నాకివ్వలేదు భూములు, పార్టీ కి ఇవ్వలేదు భూములు ప్రభుత్వానికి ఇచ్చారు, రాజధానికి ఇచ్చారు అని చెప్పడం ఆరోజు రైతులకు చేసిన అన్యాయానికి సమాధానం చెప్పుకోవాల్సిన ఈ సందర్భంలో అది చేయలేక తప్పుకునే ప్రయత్నం తప్ప మరొకటి లేదు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -