Sunday, May 5, 2024
- Advertisement -

అంతమంచి నాయకులున్నా అక్కడ టీడీపీ ఇంత దిగజారిపోయిందా .!!

- Advertisement -

జగన్ ప్రభంజనానికి టీడీపీ కి గట్టి దెబ్బె తిగిలిందని కచ్చితంగా చెప్పొచ్చు.. టీడీపీ ఆ నియోజక వర్గంలో కళ్ళు మూసుకుని గెలుస్తుంది అన్న పరిస్థి పోయి ఎంత ప్రయత్నించినా ఇకపై అక్కడ సైకిల్ గెలవదు అన్న స్థితి వచ్చేసింది.. దాంతో చాల నియోజక వర్గాల్లో టీడీపీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది.. అయితే ఇదంతా చంద్రబాబు చేసుకున్న పాపమే అంటున్నారు అక్కడి ప్రజలు. ఇక టీడీపీ కి నమ్మదగ్గ నియోజకవర్గాల్లో ఒకటైన శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గం లో టీడీపీ పరిస్థితి ఓ కొత్త పార్టీ లా తయారైందన్న విషయం అందరికి తెలిసిందే.

ఎంపీ స్థానాన్ని టీడీపీ గెలుచుకున్న, రాష్ట్ర టీడీపీకి అధ్యక్షుడు ఈ ప్రాంతపు వాడే అయినా ఇక్కడ టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది అంటే ఇక్కడ పార్టీ ని ఆ నేతలు ఎంత బ్రష్టు పట్టించారో అర్థమవుతుంది.. ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకించకపోతే టీడీపీ కి ఈ గతి పట్టించిందో అర్థం చేసుకోవచ్చు.. దీనికి తోడు గ్రూపు రాజకీయాలు టీడీపీ ని మరింత దెబ్బతీశాయి.. ఈ నియోజకవర్గంలో గతంలో ఇక్కడ కావాలి ప్రతిభా భారతి ప్రాతినిధ్యం వహించారు.. ఆమె స్పీకర్ గా కూడా చేశారు. 2009 , 2014 ఆమె పోటీ చేయగా దారుణ ఓటమి చెందారు.. దాంతో ఈ సారి ఎలక్షన్స్ లో టికెట్ త‌న కుమార్తె గ్రీష్మకు ఇవ్వాల‌ని ఆమె కోరగా ఆమెను కాదని కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన కొందరు మురళి కి చంద్రబాబు టికెట్ ఇచ్చారు.

కానీ అప్పటికే వైసీపీ లో బలంగా ఉన్నా కంభాల జోగులు కు ఆ నియోజక లో భారీ మెజారిటీ తో గెలిచారు. మురళి ఓటమితో టీడీపీ కి అయన దాదాపు దూరమయ్యారు.. ఇక అప్పటినుంచి తన అణగదొక్కేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు కళావెంకట్రావు ప్రయత్నాలు చేస్తున్నాడని సొంత పార్టీ నేతపై ఆరోపించడంతో అక్కడ గ్రూప్ రాజకీయాలు భారీగా జరుగుతున్నాయని చంద్రబాబుకు అర్థమయిపోయింది.. దాంతో అటు కొండ్రు మురళి పట్టించుకోక, భారతి కూడా తన కూతురు కు టికెట్ ఇవ్వలేదని ఆమె పట్టించుకోక పార్టీ రోజు రోజు కి రాజాం నియోజ‌క‌వ‌ర్గం లో దిగజారిపోతోంది.. పోయింది.. అక్కడ సరైన టీడీపీ నాయకుడు ఉన్నా చంద్రబాబు ఆయన్ని వాడుకోకపోవడం చాలా విడ్డురం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -