Monday, May 13, 2024
- Advertisement -

అమరావతి గురించి అలోచించి వేస్ట్..చంద్రబాబు సరికొత్త వ్యూహం..!!

- Advertisement -

అమరావతి విషయం లో చంద్రబాబు ఎక్కువ కల్పించుకోవడం లేదని ఇప్పటికే అందరికి అర్థమయిపోయింది.. అయితే ఈ విషయం కాస్త ఆలస్యం గా అర్థమయినా ఇది చంద్రబాబు ఎప్పటినుంచో అవలంభిస్తున్న పద్ధతి అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది.. రాజధాని ఎక్కడికి పోదు అమరావతి లో నే ఉంటుంది.. పోరాడండి, రోడ్డెక్కాండి అంటూ ప్రజలను మభ్య పెట్టిన బాబు తన రాజకీయ ప్రయోజనాలకు, ఉనికికి వారిని బాగానే వాడుకున్నాడు.. ఇప్పుడు మొహం చాటేస్తూ తనకేం సంబంధంలేని విధంగా ఉంటూ అమరావతి ప్రజలను మోసం చేశారు.. కేవలం అమరావతి ప్రాంత నాయకులనే పంపి చేతులు దులుపుకుంటున్నారు బాబు..అమరావతి నుంచి రాజధాని వెళ్లిపోవడం చంద్రబాబు ఇష్టం లేకుండా ఏమీ లేదు.. ఎందుకంటే విశాఖ లో టీడీపీ ఇప్పటికి బలంగానే ఉంది.. అంతేకాదు ఎంత ఓడిపోయినా విశాఖ లోనే టీడీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అమరావతి లో అయితే టీడీపీ అంతంత మాత్రంగానే ఉంది.. అయితే ఎక్కువ సీట్లు వచ్చినా విశాఖ ని వదిలేయడం కన్నా రాజధాని లేని అమరావతి ని వదిలేయడం మిన్నా అని అయన అనుకున్నారో ఏమో అమరావతి పై ఆయనకు చిన్న చూపు ఏర్పడింది..

అయితే ఒకేసారి ఈ విషయాన్నీ వెల్లడిస్తే ప్రజలు ఛీ కొడతారని అమరావతి కి అండగా ఉంటానంటూ కొన్నాళ్ళు ప్రేమను ఒలకపోసి ఇప్పుడు మెల్ల మెల్లగా దూరమయ్యారు.. గతంలో అమరావతి ఉద్యమం 100, 150, 200 రోజులకి చేసిన హడావిడి 250వ రోజు బాబు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కనపడలేదు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రంలోని ఇతర సమస్యలన్నిటినీ ప్రస్తావించిన బాబు అమరావతిని మాత్రం ఉద్దేశపూర్వకంగానే వదిలేశారంటేనే.. విషయం అర్థమవుతోంది. ఇప్పుడు ఆయన అమరావతి పై ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా పార్టీ గాడి తప్పిన ప్రాంతాలపై ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తుంది.. అయితే అమరావతి విషయంలో కేవలం కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ నేతల్ని మాత్రం ఉపయోగించుకుంటున్నారు.. అలా అమరావతి నుంచి వ్యూహాత్మకంగా పక్కకు వచ్చేశారు చంద్రబాబు. మరి దీనికి అమరావతి ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్తారో మరీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -