- Advertisement -
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాపై చిన్నచూపు చూస్తున్నారని కే.ఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు చూపంత తూర్పు గోదావరి జిల్లా పైనే ఉందని కర్నూల్ పై దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చక్రపాణి రెడ్డికి కర్నూల్‌లో ఏ వీధి ఎక్కడుందో తెలియదని, అలాంటి అతనిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం సాహసమేనని ఆయన తెలిపారు.. ఆ కొత్త అధ్యక్షుడు చాలా కష్ట పడాలని కేఈ సూచించారు. ఇక్కడితో ఆగకుండా కర్నూల్ లో మూడు సీట్లే రావడం తమ తప్పులేదని కేఈ అన్నారు.