Tuesday, May 14, 2024
- Advertisement -

రేవంత్.. బాబుకు కోపం తెప్పిస్తున్నాడా?!

- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కొన్నప్పుడే రేవంత్ రెడ్డి విషయంలో చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారట. ఎవరైనా ఇలా అడ్డంగా బుక్ అవుతారా? ఎమ్మెల్యేను కొనడానికి

వెళ్లినప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోరా? ఇలా అడ్డంగా బుక్ అయ్యి పార్టీ పరువును తీస్తారా? అని బాబు మండిపడ్డారు. అయితే బహిరంగంగా ఇలాంటి అసహనం వ్యక్తం చేస్తే లేని పోని విమర్శలు వస్తాయని చెప్పి బాబు సైలెంటయినట్టుగా తెలుస్తోంది.

మరి అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి బాబుకు కోపం తెప్పిస్తున్నాడని సమాచారం. రేవంత్ వ్యాఖ్యనాలు బాబుకు కోపం తెప్పిస్తున్నాయని తెలుస్తోంది. మొన్నటి వరకూ జైల్లో ఉండొచ్చాడు.. పార్టీ కోసం ఆ విధంగా పాటుపట్టాడు.. అనే సానూభూతిని కలిగిన రేవంత్ పై ఇప్పుడు బాబుకు అసహనం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఎందుకలా అంటే… రేవంత్ తాజాగా తనను తాను తెలంగాణ టీడీపీకి సీఎం అభ్యర్థిని అని ప్రకటించుకొన్నాడు. రాబోయే ఎన్నికల్లో తనే తెలంగాణ లో పార్టీకి సీఎం అభ్యర్థిని అవుతానని.., పార్టీ తరపున గెలిచి తనే ముఖ్యమంత్రిని కూడా అవుతానని రేవంత్ రెడ్డి చెప్పుకొన్నాడు. మరి తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినా అది బాబు కనుసన్నల్లో జరగాలి. అంతే కానీ.. ఇలా ఎవరికి వారు తమకు ఇష్టమైనట్టుగా ప్రకటించుకోవడం ఉండదు. అయితే రేవంత్ ఆ విషయాన్ని మరిచి తనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ప్రకటించుకొన్నాడు. మరి బాబుకు కోపం రాదా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -