పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ప్రకటన రాగానే ఆ క్రెడిట్ అంతా కొట్టెయ్యాలి అని చంద్రబాబు ఆయన మీడియా బృందం తెగ కంగారు పడ్డారు. ఎలాగైనా ఆ మొత్తం సాధించింది తానే అన్న రేంజ్ లో కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసారు. ఆంద్ర జ్యోతి లాంటి పత్రికలూ ఈ మీడియా లో ఏకంగా ” చంద్రబాబు అవినీతి మీద ఇన్నాళ్ళూ చేసిన పోరాటం గెలిచింది . పెద్ద నోట్లు రద్దు ” అంటూ పెద్ద న్యూస్ కూడా రాసేసింది . తీరా చూస్తే పరిస్థితి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.
జనంలో మోదీ నిర్ణయంపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో తాము పెద్దనోట్ల రద్దును స్వాగతించటం కంటే దానివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి వాటినే ప్రస్తావించి మాట్లాడటం ద్వారా ‘పెద్ద’మరక వదిలించుకోవాలని తెదేపా నాయకత్వం భావిస్తోంది. ఇన్నిరోజులయినా పరిష్కారం కాని సమస్యను తన రాజకీయ జీవితంలో ఇప్పుడే చూస్తున్నానని బాబు కూడా వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. అయితే దీని వెనుక ఎప్పట్లాగే చంద్రబాబు నమ్మే “సర్వే” మంత్రం ఉందని సమాచారం.
ఒక కీలక సర్వే చేయించుకుని మరీ తమ పార్టీ కి ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ పెద్ద నోట్ల తలనొప్పి తమని ఎలా హిట్ చెయ్యబోతోంది అని అర్ధం చేసుకుని వెంటనే ఎలర్ట్ అయ్యారట. పెద్దనోట్ల రద్దుపై ముందు అందరికంటే ఎక్కువగా మాట్లాడి దెబ్బతిన్న తెదేపా ఇప్పుడు జనస్పందన – ప్రతికూల ఫలితాలు పరిశీలించి ఇంకా మేల్కొనకపోతే ప్రజల్లో దెబ్బతింటామన్న అంతిమ నిర్ణయానికి వచ్చింది. దెబ్బకి జనాలని సవరదీయడం కోసం అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద పడ్డారు పెద్ద సారు గారు.